Gampa Govardhan About CM KCR: సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ ను బాగా డెవలప్ చేసుకున్నారని, అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత ప్రాంతం నుంచి పోటీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరారు. సీఎం సొంత గ్రామం కోనాపూర్ కామారెడ్డి నియోజకవర్గంలోనే ఉందని, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి బరిలోకి దిగాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తల్లిదండ్రులది కోనాపూర్ అని, ఇక్కడి నుంచి పోటీ చేస్తే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకే ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలని కోరినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.


కేసీఆర్ సొంతూరు కోనాపూర్ ను గతంలో పోసానిపల్లె అనేవారని, రెవెన్యూ రికార్డులలో ఇప్పుడు పేరు మారిందన్నారు. కేసీఆర్ తండ్రి ఇక్కడికే ఇల్లరికం వచ్చారని, వీరికి సంతానం 11 మంది అని తెలిపారు. ఇద్దరి పెళ్లిల్లు ఇక్కడే చేశారని, మానేరు డ్యామ్ కట్టిన సమయంలో పోలాలు ముంపులో పోయాయన్నారు. అప్పటి నిజాం ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు పరిహారం ఇస్తే, కోనాపూర్ నుంచి కరీంనగర్ జిల్లా చింతమడకకు వెళ్లి అక్కడ భూములు కొన్నారని గంప గోవర్ధన్ చెప్పుకొచ్చారు. మంత్రి కేటీఆర్ రూ5 కోట్లు వెచ్చించి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారని, అదేతీరుగా కేసీఆర్ తల్లిదండ్రుల సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. మీరు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే మీ చేతి కింద కార్యకర్తగా పనిచేస్తాను. మా ప్రజలు మరింత అభివృద్ది కోరుతున్నారని చెప్పారు. 


ఎమ్మెల్యే పదవిని ఎవరూ వదులుకోరు అని, కానీ తాను ధైర్యం చేసి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తనకు ఎమ్మెల్యే పదవి లేకపోయినా పర్లేదని, తన ప్రాంతం డెవలప్ అయితే చాలన్నారు. కొదరేమో తాను ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ను కామారెడ్డికి ఆహ్వానిస్తున్నానని దుప్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ అవతలి వ్యక్తి నిజాయితీ గలవాడు, అభివృద్ది చేసినట్లయితే తన చేతిలో 4 పర్యాయాలు ఎందుకు ఓడిపోయావో చెప్పాలని అడిగారు. రూ.2 వేల పింఛన్ ఇస్తామంటే మేం ఆపలేదు, 24 గంటల కరెంట్ ఇస్తామంటే ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు.