బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చాలా రోజుల తర్వాత నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈడీ విచారణ తర్వాత జిగిత్యాల వస్తున్న లీడర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు పార్టీ శ్రేణులు. ఇక్కడే అపశృతి చోటు చేసుకుంది. దీంతో పర్యటన రద్దు చేసుకున్న కవిత తిరిగి పయనమయ్యారు. 


జగిత్యాలలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా పండగవాతావరణ నెలకొంది. పార్టీ శ్రేణులు, కవిత  అభభిమానులు భారీగా తరలివచ్చి ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇంతలో పార్టీ లీడర్‌ బండారి నరేందర్ కుప్పకూలిపోయారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద BRS నాయకులు ఉత్సాహంతో నృత్యాలు చేస్తుండగా అకస్మాత్తుగా  అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన చనిపోయారు. 
అప్పటి వరకు సందడిగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా విషాదంతో నిండిపోయింది. రైతు నేత నరేందర్ మృతి తెలియగానే అంతా ఒక్కసారిగా కూలబడిపోయారు. విషయం తెలుసుకున్న కవిత అక్కడకు చేరుకొని నరేందర్ మృతికి సంతాపం తెలిపారు. భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నరేందర్ మృతితో జగగిత్యాలలో జరగాల్సిన ఆత్మీయ సమావేశం రద్దైంది. ఇతర కార్యక్రమాలను కూడా రద్దు చేశారు. బండారు నరేందర్ భౌతిక గాయానికి నివాళులర్పించి తిరిగి వెళ్లిపోనున్నారు కవిత. 


నేటి జగిత్యాల సభకు భారీగా ప్లాన్ వేశారు బీఆర్‌ఎస్‌ శ్రేణులు. ఈడీ విచారణ తరువాత తొలిసారిగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పర్యటనకు ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలికారు. బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవితను ర్యాలీగా కార్యక్రమం జరిగే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. గాంధీనగర్ నుంచి ర్యాలీగా వచ్చి కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి అనంతరం ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లనున్నారు.  భారీ స్వాగత ఏర్పాట్లు చేసిన బి ఆర్ యస్ పార్టీ నాయకులు శ్రేణులు. ఇంతలో ఈ ఈ మృతి అందర్నీ విషాదంలోకి నెట్టేసింది.