- చెరువు భూముల విషయంలో హైకోర్టు స్పందించి, ఎందుకు కమిటీని పంపింది?
- మీ అవినీతి ఏంటో ప్రజలకు తెలుసు... ప్రజలే సాక్ష్యం
- 25 ఏళ్ల క్రితం సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మింది మీరు కాదా?
- మీ అవినీతి ని పూర్తిస్థాయిలో బయటికి తీస్తాం
- D1 పట్టాలు ఎవరి పేరు మీద ఉన్నాయో కూడా మాకు తెలుసు
- అల్లోల కుటుంబం దోపిడీకి ఎలా పాల్పడిందో ప్రజలకు తెలీదా?
- సోయం బాపురావు గాలిలో గెలిస్తే... మరి నువ్వెలా గెలిచావ్ ఐకే రెడ్డి?
- ఐకే రెడ్డి భూ దందా అంతా బయటికి తీస్తాం: ఎంపీ సోయం బాపూరావు


నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎలా భూ కబ్జాలకు పాల్పడుతున్నారో తెలపడంతో ఒక్కసారిగా అల్లకల్లోలం అయి, ఐకే రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. చెరువు భూముల విషయంలో హైకోర్టు స్పందించి, ఎందుకు కమిటీని పంపింది? మీ అవినీతి ఏంటో ప్రజలకు తెలుసు, వారే సాక్ష్యం అన్నారు. 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మింది మీరు కాదా?, కచ్చితంగా మీ అవినీతి ని పూర్తిస్థాయిలో బయటికి తీస్తాం.. D1 పట్టాలు ఎవరి పేరు మీద ఉన్నాయో కూడా మాకు తెలుసు అన్నారు. 


అల్లోల కుటుంబం దోపిడీకి ఎలా పాల్పడిందో ప్రజలకు తెలీదా, సోయం బాపురావు గాలిలో గెలిస్తే... మరి నువ్వెలా గెలిచావ్ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆదిలాబాద్ ఎంపీ ప్రశ్నించారు. ఇంద్రకరణ్ భూ దందా అంతా బయటికి తీస్తాం, రైల్వే ప్రాజెక్టులలో 40% వాటా రాష్ట్రప్రభుత్వం ఇస్తే... 60% నిధులను కేంద్రం భరిస్తుంది. ఈ మాత్రం మాకు తెలీదా అన్నారు. ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. కొన్ని రూల్స్ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా రూ. 2072 కోట్లతో జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. కేంద్రప్ర భుత్వం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. 


పోడు భూముల సమస్య పరిష్కరించలేదని, పట్టాల పంపిణీకి దిక్కే లేదన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు వారికి పట్టాలు పంపిణీ చేసుంటే, ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావును గొత్తి కోయలు ఎందుకు చంపేవారు? అని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీ లో ఏం జరుగుతుందో కూడా మంత్రికి తెలియదని, అన్యాయంగా విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. ట్రైబల్ యూనివర్సిటీ ని ఉట్నూర్ కి కేంద్రం మంజూరు చేస్తే, దాన్ని మీరు ములుగు కు తరలించారని చెప్పారు. ఐకే రెడ్డి (ఇంద్రకరణ్ రెడ్డి) కాదు, ఆయన సికే(చెరువుల కబ్జా) రెడ్డి అని, ఆయనను వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని మనం క్యాష్ చేసుకోవాలంటూ బీజేపీ శ్రేణులకు పార్టీ ఎంపీ సోయం బాపూరావు పిలుపునిచ్చారు.

బండి సంజయ్ మాట్లాడుతూ.. జిల్లా నేతలంతా అభిప్రాయబేధాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వంపై ప్రజలు తీవ్రమైన అసంత్రుప్తితో ఉన్నారని, ఈ సమయంలో తెగించి కొట్లాడాలే తప్ప రాజీపడి రాజకీయాలు చేయెద్దని చెప్పారు. పార్టీ సిద్ధాంతం కోసం, ప్రజా సమస్యలపై తెగించి కొట్లాడే వారే బీజేపీలో ఉంటారని.... రాజీపడే వాళ్లు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం కాకుండా వ్యక్తుల కోసం పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనని సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఫలానా వారికే టిక్కెట్లు ఇస్తామని చెప్పే మాటలు నమ్మొద్దని చెప్పారు. కష్టపడి పనిచేస్తూ క్రమశిక్షణతో ఉండేవారికి, గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకుని పనిచేయాలని సూచించారు.