Mancherial Latest News: మంచిర్యాల జిల్లా వేమనపెల్లి మండలంలోని నీల్వాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సద్దుల బతుకమ్మ రోజు మహిళలను కులం పేరుతో దూషించాడని బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మాధూకర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసారు పోలీసులు. అయితే తాను ఆ అవమానం భరించలేక మాధూకర్ సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్ళి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మధూకర్ మృతికి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు అక్రమ కేసు బనాయించారంటూ కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణుల ఆరోపణ చేస్తు ఆందోళన చేపట్టారు. బీజేపీ శ్రేణులు,కుటుంబీకులు నీల్వాయి-చెన్నూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. రాస్తారోకో చేపట్టారు. స్థానిక ఎస్సై పై కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించే వరకు మృతదేహాన్ని తీసేదేలేదంటూ భీష్మించుక కూర్చున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కోనసాగుతుందన్నారు.