Bathukamma celebrations 2025 | ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటిడిఏ కార్యలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, ఆదిలాబాద్ ఆర్టీసీ డిఎం మరియు ఉట్నూర్ ఐటిడిఏ సిబ్బంది, ఐసిడిఎస్, అంగన్వాడీ తదితర సిబ్బంది పాల్గొని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ బతుకమ్మ సంబరాలను ఎలా జరుపుకున్నారనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం.

Continues below advertisement

ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని ఖుష్బూ గుప్త, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి, ఆదిలాబాద్ ఆర్టీసీ డిఎం ప్రతిమ రెడ్డి, ఐసిడిఎస్, అంగన్వాడీ సిబ్బంది అధికారులు సిబ్బంది కలిసి ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. రంగురంగుల పువ్వులను అందంగా అలంకరించి బతుకమ్మలుగా పేర్చి ఐటీడీఏ కార్యలయ ఆవరణలో వాటిని పెట్టి అందరూ సాంప్రదాయ రీతిలో ముందుగా పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. సాంప్రదాయ రీతిలో బతుకమ్మకు పూజలు నిర్వహించి అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ ఈ పండుగలను ఘనంగా జరుపుకోవాలని వచ్చే ఏడాది వరకు అందరూ కలిసికట్టుగా ఉండాలని పూజలు నిర్వహించి వేడుకల్లో భాగంగా మహిళలంతా కలిసి బతుకమ్మ పాటలతో అదే విధంగా గిరిజన సంప్రదాయ పాటలతో నృత్యాలు చేశారు.

Continues below advertisement

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిని గుప్త, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి, ఆర్టీసీ డీఎం ప్రతిమారెడ్డి, ఇతర ఐటీడీఏ ఐసిడిఎస్ సిబ్బంది గిరిజన మహిళలతో పాల్గొని బతుకమ్మలకు పూజలు నిర్వహించి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. రంగురంగుల తీరోక్క పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించి, ఐటిడిఏ కార్యలయ ఆవరణలోకి తీసుకువచ్చి వాటిని అక్కడ పెట్టి వాటి చుట్టూ అందరూ సాంప్రదాయ రీతిలో బతుకమ్మ పాటల నడమ నృత్యాలు చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. బతుకమ్మ పాటలు అదేవిధంగా సాంప్రదాయ గిరిజన రెలరేలా పాటల మధ్య అందరూ ఎంతో ఆసక్తిగా నృత్యాలు చేస్తూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగిందని ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిని కుష్బూ గుప్తా ఏబిపి దేశంతో మాట్లాడారు. ఐటీడీఏ కార్యలయ సిబ్బంది ఐసిడిఎస్ ఇతర అధికారులు స్థానిక గిరిజన మహిళలతో కలిసి సాంప్రదాయ రీతిలో బతుకమ్మ పాటలతో అదే విధంగా గిరిజన సంప్రదాయ రేలారేలా పాటల మధ్య ఈ వేడుకలను జరుపుకోవడం వారితో కలిసి నృత్యాలు చేయడం జరిగిందని, ఇది తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మహిళలకు ఎంతో ఆసక్తి కలిగించే ఈ యొక్క తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ అని.. బతుకమ్మ సంబరాలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఈ వేడుకలో భాగంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని పూజలు నిర్వహించడం జరిగిందని, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనలు దసరా దీపావళి తదితర పండుగలను కూడా ఘనంగా జరుపుకుంటారని అందులో భాగంగానే ప్రభుత్వపరంగా ఈ యొక్క బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం జరిగిందన్నారు.

అదేవిధంగా ఆదిలాబాద్ ఆర్టీసీ డిఎం ప్రతిమారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు వివిధ ప్రాంతాల్లో భిన్నంగా ఉన్నాయని, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఈ ఏజెన్సీ ప్రాంతంలో వారి సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా రేలా రేలా పాటలు మధ్య బతుకమ్మ పాటలు మధ్య నృత్యాలు చేస్తూ వేడుకలు జరుపుకోవాలని తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఇక్కడికి విడుదల సాంప్రదాయాలు తమకు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయని, సిటీలో చూసుకున్నట్లయితే వేరే విధంగా ఉంటుందని అదే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లోని వారి సాంప్రదాయం వారి నృత్యం భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుందని అది తనకి చాలా ఉత్సాహాన్ని నింపి ఎంతో ఆకట్టుకుందని ఆమె ఏబిపీ దేశంతో వివరించారు.

స్థానిక ఐటిడిఏ, ఐసిడీఎస్ కార్యాలయ సిబ్బంది ఇతర గిరిజన మహిళలు సైతం ఏబీపీ దేశంతో మాట్లాడుతూ.. బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగిందని, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా, మహిళ కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి, ఇతర అధికారులు తమతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం బతుకమ్మ సంబరాల్లో భాగంగా నృత్యాలు చేయడం తమని ఎంతో ఉత్సాహాన్ని నింపిందని, అందరూ కలిసికట్టుగా మహిళకంటూ ఒక రోజంటూ ఉందని, అది ఈ బతుకమ్మే తమని ఏకం చేసిందని, ఇలా తాము బతుకమ్మ సంబరాలు ఘనంగా అందరు కలిసికట్టుగా సుఖసంతోషాలతో ఉండాలని జరుపుకోవడం జరిగిందని, తీరకపోవులతో, తొమ్మిది రోజులపాటు ఈ బతుకమ్మ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటామని వారు తెలిపారు.