జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని లోతొర్రె బీట్లోని కంపార్ట్మెంట్ నం.280లో అక్రమ ఆక్రమణలు చేస్తున్న 26 మంది నిందితులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వారు చెట్లను నరికివేస్తూ, గుడిసెలు వేసుకుంటున్నారని అటవి అధికారులు జన్నారం FDO రామ్మోహన్ రావ్, FRO సుష్మారావ్ తో కలిసి వెల్లడించారు. వీరికి పదే పదే కౌన్సెలింగ్ చేసినప్పటికీ, నిందితులు అటవీ నేరాలను కొనసాగిస్తున్నారని అన్నారు. వీరిని లక్సెట్టిపేట్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, 14 రోజులు రిమాండ్ విధించారు. వారిని ఆదిలాబాద్ జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జన్నారం FDO రామ్మోహన్ రావ్ మాట్లాడుతూ.. అక్రమ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసారు. పాలగోరీ అటవీ ప్రాంతంలో చెట్లు నరికి అరెస్టైనవారు అక్రమ ఆక్రమణదారులే కానీ “పోడు రైతులు” కాదని అటవీ శాఖ స్పష్టం చేసారు. అరెస్టు చేసిన నిందితుల్లో పర్చాకి మారు, కనక బాపురావు, తొడసం హన్మంత రావు, ఆత్రమ్ అక్బర్ షో, ఆత్రం రాజు, విద్మ జైవంత్ రావు, సిడం యత్మా రావు, కనక మంకు, ఆత్రం భీంరావు, సోయం చత్రుగం, ఆత్రం భీంరావు, సిడం మోతీరాం, ఆత్రం సీతు, పారుబాకి మారుతి, మడావి భీంరావు, మెస్రం రాజేశ్వర్, కుమ్ర పాండు, మడావి సోమోజీ, తొడసం సీతారాం, కనక చంద్రబాను, సోయం రవీందర్, పెండోర్ జలపతి, మంగం భరత్, షేడ్మాకి సంతోష్, కనక యశ్వంత్ రావు, పెండోర్ జుగాదిరావు ఉన్నారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి, ఆదిలాబాద్ జైలుకు తరలించినట్లు తెలిపారు.