CM KCR : నిజామాబాద్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్, సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. "ప్రధానమంత్రి మోదీని ప్రశ్నిస్తున్నాను. నాన్‌ పర్మార్సెన్ అసెట్స్‌ కింద కేంద్రం దోచిపెట్టిన సంపద పన్నెండు లక్షల కోట్లు. భారత్‌లో ఉత్పత్తి అవుతుందో విద్యుత్ లో రైతులు వాడుకునేది 20.8శాతమే. ధాని ధర రూ.లక్షా నలభై ఐదు కోట్లు మాత్రమే. బ్యాంకులు లూటీ చేసిన వాళ్లకు వేల కోట్ల దోపిడీ చేసిన వాళ్లకు కమీషన్లు తీసుకొని పన్నెండు లక్షల కోట్లు మాఫీ చేసినావే. లక్ష కోట్లు రైతులకు ఇవ్వడానికి చేతులు రావడం లేదా అని అడుగుతున్నాను. భారతదేశమంతటా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నాన్ బీజేపీ జెండా మాత్రమే ఎగురుతుంది. పేదల, రైతుల, కార్మిక వ్యతిరేక బీజేపీని సాగనంపుదాం. దిల్లీ గద్దెపై మన ప్రభుత్వం రాబోతోంది. వచ్చే ఎన్నికల్లో వచ్చే బీజేపీ ముక్త భారత్‌. దేశంలోని రైతులందరికీ తీపి కబురు చెప్తున్నాను. తమ ప్రభుత్వం వస్తే దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తాం" అని కేసీఆర్ అన్నారు. 


దేశం కోసం తెంలగాణ నుంచి పోరాటం 


నిజామాబాద్‌లో రైతుల భూములు లాక్కుని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని కుట్ర జరుగుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.  ఒకనాడు మోతె గ్రామంలో చెప్పానని, ప్రాణం పోయినా సరే తెలంగాణ తీసుకొస్తా అన్నానని తెచ్చినని తెలిపారు.  ఒకనాడు గ్రామానికి ఎన్ని నిధులు వచ్చేవి ఇప్పుడు ఎన్ని వస్తున్నాయని ప్రశ్నించారు. ఇలా వస్తున్న దాన్ని పోగొట్టుకుందామా? మనకు వద్దందామా? అని ప్రశ్నించారు.  దేశం కోసం తెలంగాణ నుంచి పోరాటం చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. 


బీజేపీ బలుపుతో ఉంది


"ఎవరైతే బావి వద్ద మీటర్లు పెట్టమంటున్నారో? రైతులను ఆత్మహత్యలు చేసుకోమంటున్నారో? వాళ్లు మన దగ్గర మీటర్ పెట్టడం కాదు. మనం ఏకమై వానికే మీటర్‌ పెట్టాలే. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి, గొప్ప వరం భారత్‌కు దేవుడు ఇచ్చాడు. భారత్‌లో భూభాగం 83 కోట్ల ఎకరాలు. ఇందులో సుమారు 40 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి పనికి వస్తుంది. మోదీ డంబాచారం తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టుకట్టలేదు. ఉన్నవి అమ్మేస్తున్నారే తప్ప కొత్తగా తెచ్చిందేమీ లేదు. మోటార్‌ వద్ద మీటర్లు పెట్టి భూములు గుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఊళ్లల్లో మీరు మీటింగ్‌లు పెట్టుకొని రైతు వ్యతిరేక విధానాలపై మాట్లాడుకోవాలి. రైతు వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్న వారిపై తిరగబడాలి. నిరుద్యో సమస్య పెరిగింది. రూపాయి పతనమైంది. ఏ ఒక్క రంగానికి చేసిన మంచి పని లేదు. ఏ వర్గాన్ని ఉద్దరించింది లేదు. అంతర్జాతీయంగా పరువు పోవడం తప్ప చేసిందేమీ లేదు. ప్రతిపక్షాలను విచ్చిన్నం చేస్తూ ప్రభుత్వాలను పడగొడుతూ బలుపుతో ఉన్నారు" - సీఎం కేసీఆర్  


మతపిచ్చి మంటల్లో కాలిపోవాలా? 


"ఆనాడు నేను బయల్దేరినప్పుడు నేను ఒక్కడినే. మీ అందరూ కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇప్పుడు ప్రజలను కాపాడుకుంటున్నాం. అన్ని వర్గాలను కాపాడుకుంటున్నాం. ఇలానే దేశం బాగుపడాలి. దేశం బాగుపడాలంటే ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలి. ప్రతిపక్షాలను చీల్చడం ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్టు కొంటున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే మంచి రాజకీయం ఉండదు. చాలా రాష్ట్రాల నుంచి చాలా మంది రైతులు వచ్చి దేశం కోసం పిడికిలి బిగించాలని అడుగుతున్నారు. మీరంతా చెబితే వెళ్దాం. త్వరలోనే జాతీయ రాజకీయ ప్రస్తానం కూడా ప్రారంభిద్దాం. తెలంగాణ బాగు చేసినట్టే దేశాన్ని బాగుచేద్దాం. అన్ని రంగాల్లో విఫలమైన కేంద్రం ఏం చేస్తోంది? ఏం జరుగుతోంది? ఏం మంటలు పెడుతున్నారు. గోదావరి నీరు కావాలా? మతపిచ్చి మంటల్లో కాలిపోవాలా? ఇల్లు కట్టాలంటే చాలా కష్టం. కూలగొట్టడం చాలా సులభం. దేశం దెబ్బతింటే మళ్లీ బాగుపడాలంటే చాలా కష్టం. అందుకే ఈ దుర్మార్గమైన బీజేపీని సాగనంపాలి.  పాతకలెక్టర్‌ భవనం స్థానంలో ఇందూరు కళాభారతి పేరుతో ఆడిటోరియం నిర్మిస్తాం"- సీఎం కేసీఆర్