Nirmal News: రన్నింగ్‌లో ఊడిన బస్సు టైర్లు, లోపల 170 మంది ప్రయాణికులు

Telangana News: నిర్మల్ డిపోకు చెందిన బస్సు 170 మందితో ప్రయాణిస్తుండగా బస్సు వెనకాల రెండు టైర్లు ఊడిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగలేదు.

Continues below advertisement

Nirmal News: టీజీఎస్ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా వెనుక చక్రాలు ఊడిపోయిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. 50 మంది ఎక్కాల్సిన బస్సులో 170 మంది ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై వేగంగా బస్సు వెళ్తుండగా దాని వెనక వైపున రెండు చక్రాలు ఊడిపోయి.. పక్కనే చెట్లలోకి దొర్లుకుంటూ పోయాయి. నిర్మల్ డిపో బస్ జగిత్యాల నుంచి వెళుతుండగా మొరపెల్లి వద్ద 170 మందితో ప్రయాణిస్తుండగా బస్సు వెనకాల రెండు టైర్లు ఊడిపోయాయని తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Continues below advertisement

Continues below advertisement