Naveen Yadav declared as Congress candidate for Jubilee Hills: జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.   ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  మొదటి నుంచి నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. హైకమాండ్ అంగీకరించింది.  

జూబ్లిహిల్స్ లో వ్యక్తిగత ప్రాబల్యం ఉన్న లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్  

జూబ్లిహిల్స్ లో చిన్న శ్రీశైలం యాదవ్ పేరు తెలియని వారు ఉండరు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనంటే భయంతో కూడిన గౌరవం ఇస్తుంది. అయితే ఆ గౌరవం భయం వచ్చిందని అంటారు. ఆయనకు అక్కడ రౌడీగా పేరు ఉంది.  అలాంటి ఇమేజ్ ఉన్న ఆయన కుమారుడే నవీన్ యాదవ్. బస్తీల్లో పట్టు ఉన్న కుటుంబం. ముస్లిం వర్గాల్లోనూ వారికి పట్టు ఉంది. వారి ఇమేజ్ కారణంగా ప్రధాన పార్టీలు టిక్కెట్ ఇచ్చేవి కావని చెబుతారు. కానీ ఓవైసీ మాత్రం ఆ కుటుంబాన్ని ప్రోత్సహించారు.           

గతంలో మజ్లిస్ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నవీన్ యాదవ్              

మజ్లిస్ తరపున నవీన్ యాదవ్ ఓ సారి పోటీ చేశారు. 2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి .. 9వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ తో అవగాహన కారణంగా టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 2023లోనూ అదే అవగాహన కొనసాగడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు రేవంత్ ఆయన కుటుంబం మాస్ పవర్ పై నమ్మకంతో వారికే టిక్కెట్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అజహర్ కు టిక్కెట్ ఇచ్చినా నవీన్ యాదవ్ కు ఇంచార్జ్ పోస్టు ఇచ్చారు. ఉపఎన్నిక రావడంతో  అవకాశం దక్కింది.          

గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిక 

ఉపఎన్నికల్లో పోటీ కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. అజహరుద్దీన్ కూడా గట్టిగా ప్రయత్నించారు . కానీ ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఆఫర్ చేసి రేసు నుంచి తప్పించారు. అంజన్ కుమార్ యాదవ్ కూడా. ..నియోజకవర్గంలో హడావుడి చేశారు.  దానం నాగేందర్ కూడా.. ఖైరతాబాద్ నియోజకవర్గానికి రాజీనామా  చేసి. .. జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే.. అలాంటి ప్రతిపాదలను అంగీకరించలేదు.  నవీన్ యాదవ్ కు వ్యక్తిగత బలం కూడా ఉండటంతో ఆయనకు చాన్స్ ఇస్తే గెలుపు ఖాయమని కాంగ్రెస్ అనుకుంటోంది. దానికి తగ్గట్లుగానే అధికారికంగా ప్రకటించారు.