Nalgonda BRS Office: అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్ ఆఫీస్‌ను కూల్చేయాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించింది. నల్గొండలోని ఆఫీస్‌ను పదిహేను రోజుల్లో నేల మట్టం చేయాలని స్పష్టం చేసింది. 


నల్గొండలో ఉన్న బీఆర్‌ఎస్ ఆఫీస్‌ను రెగ్యులరైజ్ చేసేలా అధికారులను ఆదేశించాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అనుమతి తీసుకోకుండా ఆఫీస్‌ కట్టి... ఇప్పుడు రెగ్యులరైజ్ చేయాలని అడగడం ఏంటని ప్రశ్నించింది. అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన ఆఫీస్‌ను 15 రోజుల్లో కూల్చేయాలని స్పష్టం చేసింది. దీంతోపాటు దానికి అయ్యే ఖర్చును నష్టపరిహారం రూపంలో లక్షరూపాయలను బీఆర్‌ఎస్ పార్టీ చెల్లించాలని తేల్చి చెప్పింది.