Indiramma Indlu Scheme : ప్రభుత్వం నుంచి ఎన్ని పథకాలు అమలు అవుతున్నా సరే ఇప్పటికీ గూడు లేని పేదలు దేశంలో కోట్ల మంది ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం నిధులు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఈ ఇల్లు పూర్తి కాకపోవడం, మిగతా డబ్బులు సమకూర్చుకునే స్తోమత ఉండు. అలాంటి వారంతా మంజూరు అయిన ఇల్లు కట్టకుండా వదిలేస్తున్నారు. లేదా సగంలో ఆపేస్తున్నారు. ఫతిలంగా ప్రభుత్వం నిధులు వృథా అవుతున్నాయి. నివాస గృహాలు లేని వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. దీన్ని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకు నుంచి లోను ఇప్పించే ప్రయత్నం ప్రారంభించింది. 

ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ఎక్కువగా మహిళల పేరు మీదనే మంజూరు అవుతున్నాయి. ముఖ్యంగా గృహ పథకాలు లాంటివి మహిళల పేరునే ప్రభుత్వాలు  అమలు చేస్తున్నాయి. మహిళలు ఎక్కువ శాతం డ్వాక్రాసంఘాల్లో సభ్యులై ఉంటారు. కచ్చితంగా అందులో రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడం చేస్తూనే ఉంటారు. అందుకే ఈ డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రుణాలు ఇప్పించేందుకు సిద్ధమైంది.  

ఖమ్మం జిల్లాలో అధికారులు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ విజయవంతమైతే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో 405 మంది ఇందిరమ్మ రుణ లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు మంజూరు అయ్యాయి. వీరిలో 281 మందికి రుణాలలు ఇచ్చేశారు. డ్వాక్రా సంఘంలో వారు తీసుకున్న రుణాలు, చెల్లిస్తున్న విధానం, అన్నింటినీ పరిగణలోకి తీసుకొని రుణ పత్రాలు మంజూరు చేస్తున్నారు.  

తెలంగాణ వ్యాప్తంగా చాలా మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. వారంతా నిజమైన అర్హులే అయినప్పటికీ చేతలో డబ్బులు లేక, ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎటూ సరిపోక ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్న అధికారులకు ఇదే సమాధానం వస్తోంది. ఇందరిమ్మ ఇళ్లు గ్రౌండింగ్ కాకపోవడంపై మంత్రి పలు మార్లు సమీక్షలు నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

ప్రజల సమస్య గుర్తించిన మంత్రి డ్వాక్రాసంఘాలతో టైఅప్ చేశారు. దీని వల్ల నిశ్చింతగా బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ముందుకొస్తాయని, ఫలితంగా లబ్ధిదారుల ఆర్థిక కష్టాలు కూడా గట్టెక్కుతాయని ఆలోచించారు. ముందుగా ఆయా డ్వాక్రా సంఘాలు ఒప్పించారు. ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని గుర్తించారు.  ముందుగా వారికి సహాయం చేసేలా ప్లాన్ వేశారు. అలా ఖమ్మంలో నాలుగు వందల మందిని గుర్తించి వారికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. 250 మందికిపైగా లబ్ధిదారులకు రుణాలు మంజూరు అయిపోయింది. మిగతా వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. వారికి కూడా వారం పదిరోజుల్లో ప్రక్రియ పూర్తి అవుతుందని అంటున్నారు.

ఏదోలా డబ్బులు సర్దగలిగితే కచ్చితంగా తాము ఇళ్లు నిర్మించుకుంటామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చొరవ తమకు వెసులుబాటు కల్పిసస్తుందని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో చేపట్టిన ప్రయోగం విజయవంతమైతే మిగతా జిల్లాల్లో అనుసరించే అవకాశం ఉంది.