Musi River gates open alert for catchment area | హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జంట నగరాలలోని జలాశయాలు ఇదివరకే నిండుకుండలా మారాయి. వర్షాల వల్ల మూసీ ప్రాజెక్ట్ యొక్క పరివాహకపు (క్యాచ్మెంట్ ఏరియా) ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఇన్ ఫ్లో బాగా పెరిగింది. ప్రస్తుతం మూసీ ప్రాజెక్ట్‌లోకి 1427 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
శుక్రవారం ఉదయం 8:00 గంటలకు మూసి ప్రాజెక్ట్ రెండు క్రస్ట్ గేట్ల నుండి 1,260 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న కారణంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాలలోని మూసీ నది పరివాహక గ్రామాల వారిని చాలా జాగ్రత్తగా ఉండాలని సూర్యాపేట ఇరిగేషన్ డివిజన్ నెం.1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూచించారు.
నల్గొండ జిల్లా 1. బొప్పారం 2. కాసనగోడు 3. చీకటిగూడెం 4. కొత్తపేట 5. ఉప్పలపహాడ్ 6. కొప్పోలే 7. భీమారం 8. అమంగల్ 9. లక్ష్మీదేవి గూడెం 10. రావులపెంట 11. రాజాపేట 12. నరసింహులగూడ 13. తక్కెలపాడు 14. కాల్వపల్లి 15. అలగడప 16. రాయనపాలెం 17. ముల్కల్ కాల్వ 18. కేశవాపూర్ 19. తుంటకుంటవిల్లా 20. వాడపల్లి 21. వజీరాబాద్
సూర్యాపేట జిల్లా 1. రత్నాపురం, 2. రామవరం, 3. హనుమంతండా 4. వెంకటరాంపూర్ టేకుమట్ల, 5. నంద్యాలగూడెం, 6. కొంకతిమ్మని అన్నారం, 7. సర్కిల్‌పేట, 8. కసరాబాద్, 9. అన్నాజీపురం 10. అనంతరామ్, 11. దోసపహాడ్, 12. సజ్జపురం, 13. గంటావారి గూడెం, 14. యెల్లారం, 15. సోమవరం, 16. చింత కుంట్ల, 17. పులగంబండ తండా, 18. మూసి వొద్దు సింగారం, 19. ఎల్లాపురం, 20. శూన్యపహాడ్ Telangana Rains, Nalgonda News, Telugu News, Telangana News, Rains, Musi River