BJP MP Bandi Sanjay Questions Communist Parties over Friendship with TRS: మొన్నటి దాకా కమ్యూనిస్టులను తోకపార్టీలు, సూది దబ్బడం పార్టీలన్న సీఎం కేసీఆర్ ఈరోజు వాటిని ప్రగతి శీల శక్తులని చెబుతుండు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తలు వేదనకు గురైతున్నరని, కమ్యూనిస్టు సిద్దాంతాలను కేసీఆర్ కాళ్ల ముందు పెట్టారని వ్యాఖ్యానించారు. నిన్నటిదాకా ఇండ్ల కోసం, ఉద్యోగాల కోసం, రైతుల కోసం, ఎస్టీఎస్సీ సమస్యలపై కమ్యూనిస్టు కార్యకర్తలు కొట్లాడినరు... మరి ఇయాళ అవన్నీ వచ్చినయా? మరి దేని కోసం టీఆర్ఎస్ కు మద్దుతు ఎందుకు ఇస్తున్నరు? ఎన్ని వేల కోట్లు ముట్టజెప్పితే మద్దతు తెలిపారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
కమ్యూనిస్టు కార్యకర్తల పరిస్తితి ఏంది?
నిన్నటి దాకా కమ్యూనిస్టులు టీఆర్ఎస్ ను శత్రువుగా చూసి... ఇయాళ ఎందుకు మిత్రుడు అయ్యారు? నిన్నటిదాకా పోరాటాలు చేసిన కేసులపాలైన కమ్యూనిస్టు కార్యకర్తల పరిస్తితి ఏంది? అందుకే కమ్యూనిస్టు కార్యకర్తలు ఈసారి టీఆర్ఎస్ కు ఓటేయబోమని చెబుతున్నరో ప్రజలకు వివరించాలన్నారు. పొరపాటున టీఆర్ఎస్ కు కమ్యూనిస్టులు ఓట్లేస్తే... ప్రజలు నిలదీస్తారు. రుణమాఫీ కాలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు? ఉద్యోగాలియ్యలేదు... ఎందుకు మద్దతిచ్చారని నిలదీస్తారని, అప్పుడు కమ్యూనిస్టు జెండాలు వెలిసిపోతాయన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలు ఇద్దరు అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోటీ అని... ఆ ఇద్దరిలో ఎవరు బెటరో బేరీజు వేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎట్లాంటోడో... స్ర్కిప్ట్ రాసిస్తే తప్ప మాట్లాడలేనోడు అని మునుగోడు ఓటర్లు గుర్తుంచుకోవాలని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నడు ఇన్నాళ్లు... ఇగ దేశం మీద పడి దోచుకుంటడ... మునుగోడు ఫలితాలు బీఆర్ఎస్ కు పునాది రాయి అయితదని కేసీఆర్ అంటున్నడు.. కానీ మునుగోడు ఫలితాలే బీఆర్ఎస్ కు సమాధి రాయి కాబోతోందన్నారు.
యాదాద్రి వెళ్లి ప్రమాణం చేసే దమ్ముందా ?
ఎవరైనా తప్పు చేసినోడు తడిబట్టలతో యాదాద్రి వెళ్లి ప్రమాణం చేసే దమ్ముందా?. మా నిజాయితీని నిరూపించుకోవడానికే తడిబట్టలతో ప్రమాణం చేసినం. కానీ సీఎం కేసీఆర్ కు ఆ నిజాయితీ లేదు. కుట్రలు చేస్తావు కాబట్టే ప్రమాణం చేయడానిక రాలేదన్నారు బండి సంజయ్. కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టే.. సీబీఐ ఎంక్వేరీకి కూడా ఒప్పుకోవడం లేదన్నారు. మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా పారిపోయిన వ్యక్తి కేసీఆర్ అని.. టీఆర్ఎస్ కు టీఎన్జీవో నాయకులు మద్దతివ్వడం సిగ్గుచేటు అన్నారు. ప్రమోషన్ల కోసం, పైరవీల కోసం సిగ్గులేకుండా ఆ నాయకులు మద్దతిస్తున్నరని, ఉద్యోగాలకు జీతాలే ఇయ్యనందుకు మద్దతు చెబుతున్నరా? 317 జీవో పేరుతో చెట్టుకొకరు పుట్టకొకరిని చేసినందుకా? అని టీఎన్జీవో నాయకులను ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్నందుకు మద్దతు తెలుపుతున్నరా?. టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన ఆ కొందరు టీఎన్జీవో నాయకులపై కేసులు పెట్టాలని అభిప్రాయపడ్డారు.
Also Read: Bandi Sanjay: సంతలో పశువుల్లా అమ్ముడుపోయే ఆ ఎమ్మెల్యేలు ఆణిముత్యాలట: బండి సంజయ్ ఫైర్