తనను అందరూ సీఎం, సీఎం అనొద్దని.. గతంలో మంత్రి పదవినే వదిలేసిన తనకు ఏ పదవీ ముఖ్యం కాదని అన్నారు. తనకు ప్రజలే ముఖ్యం అని, ప్రజల కోసం చావడానికైనా, చంపడానికైనా సిద్ధమే అని అన్నారు. ఐదుసార్లు గెలిపించినా ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద కృష్ణా జలాలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజలు చేశారు. ఇది ఆయనకు 60వ పుట్టినరోజు. దాదాపు 500 కార్ల భారీ కాన్వాయ్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అనుచరులతో కలిసి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఆయన మాట్లాడారు. సీఎం అనుకుంటే తాను అవుతానని, మీరు సీఎం.. సీఎం అంటే అంతా కలిసి ఎమ్మెల్యే తరహాలోనే ఓడిస్తారని అన్నారు. వచ్చే వారం పది రోజుల్లో నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. తాను సీఎం పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని చెప్పారు.