Honor Killing Case | హైదరాబాద్: దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ పరువు హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు తెలంగాణ హైకోర్టు సిబిఐ (CBI) విచారణకు ఆదేశించింది. లా డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిఖిల్.. బర్త్‌డే పార్టీకి వెళ్లగా, ఈ క్రమంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Continues below advertisement

యువతి కుటుంబసభ్యులే హత్య చేశారు: నిఖిల్ తల్లిదండ్రుల ఆరోపణలుబాధితుడు నిఖిల్ తల్లిదండ్రుల తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిల్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ కారణంగా ఆ యువతి తల్లిదండ్రులే పక్కా ప్రణాళికతో నిఖిల్‌ను కిడ్నాప్ చేసి, ఉరివేసి దారుణంగా హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన రోజున ఇంట్లోనే ఉన్న నిఖిల్‌ను బర్త్‌డే పార్టీ ఉందంటూ కొందరు వచ్చి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నిఖిల్ కనిపించకుండా పోవడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో తాము కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిఖిల్ కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత, చిలుకూరు సమీపంలోని ఒక కాలువలో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 

Also Read: Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు

Continues below advertisement

న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులుఈ కేసు తీవ్రతను బట్టి గతంలోనే ప్రభుత్వం దీనిపై సిఐడి (CID) విచారణకు ఆదేశించింది. అయితే, అటు స్థానిక పోలీసుల దర్యాప్తులోనూ, ఇటు సిఐడి విచారణలోనూ తమకు ఎలాంటి న్యాయం జరగలేదని నిఖిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడి మరణానికి కారణమైన అసలైన నిందితులను కాపాడుతున్నారని నిఖిల్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం, స్థానిక పోలీసులు, సీఐడీ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. నిఖిల్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలను వెలికి తీసేందుకు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ సోమవారం నాడు (జూన్ 29న) సంచలన తీర్పునిచ్చింది.

2022 అక్టోబర్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువలో సూర్యాపేటకు చెందిన 22 ఏళ్ల లా పట్టభద్రుడు ధరావత్ నిఖిల్ మృతదేహం లభించింది. అయితే అగ్రకులానికి చెందిన యువతితో ఇంటర్మీడియట్ నుంచి ఉన్న స్నేహం ప్రేమగా మారింది. అయితే వీరి కులాలు వేరు కావడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది.  నిఖిల్ గిరిజనుడు కావడంతో అమ్మాయి కుటుంబం, బంధువులు తమ కుమారుడ్ని పరువు హత్య చేశారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపించారు.