Nalgonda Crime News: దీపావళి అన్ని ప్రాంతాల్లో సరదాగా జరుపుకుంటున్నారు. ఆనందంగా పండుగ చేసుకుంటున్న రోజు నల్గొండ జిల్లాలోని ఓ గ్రామంలో విషాదం నెలకొంది. భర్తతో కలహాలు కారణంగా ఓ తల్లి తన ఇద్దరి పిల్లల్ని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రపదేశ్‌లోని బాపట్ల జిల్లా జనగాల గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి ఫ్యామిలీ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నివాసం ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె పేరు అవంతిక. వయసు 9 ఏళ్లు. కుమారుడు పేరు భవన్ సాయ. వయసు ఏడేళ్లు. చాలా కాలంగా భర్తతో గొడవలు జరుగుతున్నాయి. ఇవి ఎక్కువ కావడంతో ఆ తల్లి విషాదకరమైన నిర్ణయం తీసుకుంది. తను చనిపోవాలని భావించింది. తాను చనిపోతే ఇద్దరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారో అని ఆలోచింది.
అందుకే ఆ తల్లి ఇద్దరి పిల్లల్ని కూడా తనతో తీసుకెళ్లిపోవాలని నిర్ణయించింది. అందుకే కొడుకు, కుమార్తెను ముందుగా బలి తీసుకుంది. తర్వాత తను ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం చాలా సమయం అయినా తలుపులు తీయకపోవడంతో పొరిగింటి వాళ్లకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి తలుపులు తీసి చూస్తే దారుణం వెలుగులోకి వచ్చింది.