Doctors Cheating: ఆస్పత్రికి వచ్చిన నిండు గర్భిణీకి శస్త్ర చికిత్స చేశారు. అయితే అది వికటించి ఆమె అక్కడే మృతి చెందింది. కానీ ఆమె పరిస్థితి విషమించింది హైదరాబాద్ కు తీసుకెళ్తున్నామని నమ్మబలికారు. కాసేపయ్యాక వచ్చి ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని వివరించారు. వారి మాటలు నమ్మకం కల్గించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు గొడవకు దిగారు. దీంతో.. ఆస్పత్రి యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా వారికి 8 లక్షల నష్టపరిహారం ఇస్తామంటూ ఒప్పంద పత్రం రాసిచ్చారు. అయితే ఈ విషయం మీడియాకు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 


చనిపోయిన మహిళకు చికిత్స చేస్తూ..


నల్గొండ జిల్లాలోని తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ ప్రసవం కోసం... ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. ఆదివారం రోజు సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కాసేపటికే.. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళ అక్కడే చనిపోయింది. అయితే తాము చేసిన శస్త్ర చికిత్స వికటించే ఆమె చనిపోయిందని తెలిసి ఎక్కడ గొడవ చేస్తారో అనుకున్న ఆస్పత్రి యాజమాన్యం ఓ సరికొత్త ప్లాన్ వేసింది. అచ్చం ఠాగూర్ సినిమాలో లాగానే చనిపోయిన గర్భిణీ మహిళకు చికిత్స అందించింది. అయితే ఆమె పరిస్థితి విషమించిందని చెప్పి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిందని నమ్మబలికారు. 


గుట్టుచప్పుడు కాకుండా ఒప్పంద పత్రం..


అయితే వైద్యులు సంబంధం లేకుండా పది నిమిషాలకో వార్త చెప్పేసరికి మృతురాలి కుటుంబ సభ్యులకు, బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగారు. మీ నిర్లక్ష్యం వల్లే నిండ గర్భిణీ మృతి చెందిందంటూ నానా రచ్చ చేశారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం.. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తామని చెప్పింది. దీంతో బాధిత కుటుంబీకులు కాస్త చల్లబడ్డారు. అక్కడికక్కడే 8 రూపాయలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీనికోసం ఆస్పత్రి యాజమాన్యం ఒప్పంద పత్రం కూడా రాసిచ్చింది. ఇది కాస్తా మీడియాకు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


ఇటీవలే కు.ని ఆపరేషన్లు ఫెయిల్ అయి నలుగురు మృతి..


రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నాలుగురు మహిళలు మృతి చెందిన ఘటన సంచలనం అయింది. ఈ ఘటనకు నివారణ చర్యలు చేపట్టిన తెలంగాణ వైద్యశాఖ తప్పడగువేసిందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విచారణకు ఆదేశించాం..మరో వారం రోజుల్లో విచారణ పూర్తవుతుందని చెప్పిన వైద్యశాఖ ఉన్నాతాధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకుంది. ఆయనపై శాశ్వతంగా అనర్హత వేటువేశారు. కొందరు డాక్టర్లను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించడంతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడం చేశారు. ఇదంతా చూస్తుంటే తప్పు జరిగిన మూలాలు గుర్తించి, మరోసారి అలాంటి విషాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం కంటే తప్పును పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాంపులతో  మాఫీ చేస్తున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.