Breaking News Telugu Live Updates: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 22 Oct 2022 01:33 PM
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత 

శ్రీశైల జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఆరవ సారి ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నాగార్జునసాగర్ కు వరదనీటిని రేడియల్ క్రస్ట్ గెట్ ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపు ఊరుకలేస్తుంది. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల,సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 2,52,501 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 3,45,113 క్యూసెక్కులు వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు, కాగా ప్రస్తుతం 213.8824 టీఎంసీలుగా ఉంది శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.

గోవాలో 53వ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్

గోవా: వచ్చే నెల 20 నుండి 28 వరకు గోవాలో 53వ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్


రెండు తెలుగు సినిమాల ప్రదర్శన , ఆర్ ఆర్ ఆర్, అఖండ లకు గుర్తింపు 


ఫిలిం ఫెస్టివల్ తేదీలు, ప్రదర్శించే సినిమాల వివరాలు ప్రకటించిన ఇండియన్ పనోరమా


ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలం ఫెస్టివల్స్ లో ఒకటిగా ఇండియా ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 


ఈ సారి 25 ఫీచర్ ఫిలిమ్స్, 20 నాన్ ఫీచర్ ఫిలిమ్స్ ప్రదర్శన


మెయిన్ స్ర్టీమ్ సినిమా సెక్షన్ లో ప్రదర్శించే ఐదు సినిమాల్లో రెండు తెలుగు సినిమాలకు చోటు 


ఆర్ ఆర్ ఆర్, అఖంఢ సినిమాల ప్రదర్శన


ఆర్ ఆర్ ఆర్, అఖంఢ లతో పాటు మెయిన్ స్ర్టీమ్ సినిమా సెక్షన్ లో కాశ్మీర్ ఫైల్స్ (హిందీ) టోనిక్ ( బెంగాలీ) ధర్మం వీర్ ముక్కడ్ పోస్ట్ థానే (మరాఠీ) ప్రదర్శన


ఫీచర్స్ ఫిలిమ్స్ విభాగంలో సినిమా బండి, కుదిరం బోసే తో పాటు ప్రదర్శన

పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు

జనసెన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు


మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్


మూడు పెళ్ళిల్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని మహిళలకు క్షమాపణలు చెప్పాలని నోటీసులు ఇచ్చిన మహిళా కమీషన్

Amaravati Padayatra: నిలిచిపోయిన అమరావతి రైతుల పాదయాత్ర

పోలీసుల తీరుకు నిరసనగా అమరావతి రాజధాని రైతులు పాదయాత్రను నిలుపుదల చేశారు. పోలీసుల తీరుపై న్యాయస్థానంలోనే తేల్చుకుని తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తామని రైతుల ప్రకటించారు. ఐకాస నేతల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రకు దాదాపు 4 రోజులు తాత్కాలిక విరామం మాత్రమే అని ఐకాస ప్రకటించింది. న్యాయస్థానానికి సెలవులు ఉన్నందున అంతవరకు పాదయాత్ర నిలుపుదలకు నిర్ణయించామని తెలిపారు. కోర్టు నుంచి మార్గదర్శకాలు తీసుకుని అరసవల్లి వరకు పాదయాత్ర కొనసాగించాలని ఐకాస నిర్ణయించింది.

Tirumala శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్

తిరుపతి : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్, వైసీపి ఎమ్మెల్యే వెంకట గౌడ్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..

Background

రైతులు చేపట్టిన అమరావతి పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాజ్యాంగ బద్ధంగా అనుమతి తీసుకుని వెళ్తున్న వారిని ఏవో కారణాలతో అడ్డుకోవడం సరికాదని, రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు ఇది వరకే తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. అమరావతి పాదయాత్రతో పాటు 3 రాజధానుల అంశంపై సైతం లక్ష్మీనారాయణ స్పందించారు. కేవలం భవనాలు నిర్మిస్తే అభివృద్ధి జరిగినట్లు కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 


అమరావతి పాదయాత్ర అంశం సుప్రీంకోర్టులో ఉంది. పైగా ఏపీ ప్రభుత్వమే అప్పీల్ కు వెళ్లిందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం తీర్పుల కోసం ఎదురుచూడకుండా, నిర్ణయాలు తీసుకుంటూ అవరోధాలు కలిగించడం సబబు కాదన్నారు. విశాఖను రాజధాని చేయడం కాదు, ఐటీ క్యాపిటల్ గా డెవలప్ చేయాలని సూచించారు. ఐటీ కంపెనీలు విశాఖకు తరలివస్తే రాష్ట్ర యువతకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వస్తాయన్నారు. మూడు ప్రాంతాలు, మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్న ఏపీ ప్రభుత్వం విశాఖలో నాలుగు బిల్డింగ్ లు కడితే అభివృద్ధి జరిగినట్లేనా అని ప్రశ్నించారు. ప్రజలకు సరైన మౌలిక వసతులు కల్పించడం, ఉద్యోగాలు వచ్చేలా చేసినప్పుడే రాష్ట్రంలో ప్రగతి సాధించినట్లని, అన్ని జిల్లాలు డెవలప్ కావాలని ఆకాంక్షించారు.


తిరుమలలో‌ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు అర్చకులు. శుక్రవారం 21-10-2022 రోజున 62,203 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 29,100 మంది తలనీలాలు సమర్పించగా, 3.91 కోట్ల రూపాయలు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు భక్తులు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 28 కంపార్ట్మెంట్లల్లో భక్తులు నిండి పోయారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 10 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. 


ఉత్తర, దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. నేడు బంగాళాఖాతంలో వాయుగుండం తుపానుగా మారుతుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. అయితే సిత్రాంగ్ తుపానుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్ 24 ఒడిశా తీరాన్ని చేరుకుని, అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు. 


సిత్రాంగ్ తుపాను, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం తుపానుగా మారడంతో మరో మూడు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశాయి అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు. ఏపీకి సిత్రాంగ్ తుపాను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సిత్రాంగ్ తుఫానుకి ఎటువంటి సంబంధం ఉండదని, ఏపీ, తెలంగాణలో వర్షాలు మాత్రం ఉంటాయి. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. 


నేడు సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తూర్పు దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 


సిత్రాంగ్ తుపాను ముప్పు తప్పినప్పటికీ, ఏపీపై కాస్త ప్రభావం చూపుతోంది. తుపాను ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పలుచోట్ల వర్షాలున్నాయి. వర్ష సూచనతో మూడు రోజులవరకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలున్నాయి.


గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమపై సిత్రాంగ్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. అన్నమయ్య జిల్లాలోని పలుచోట్ల ముఖ్యంగా మదనపల్లి - పుంగనూరు బెల్ట్, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ, కడప జిల్లాలోని జమ్మలమడుగు పరిసరాల్లో వర్షాలు కురవనున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.