Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో వివాహితపై యువకుడు కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. కొంతకాలం నుంచి సదరు వివాహితను ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకోవాలని యువకుడు మహిళ వెంటపడుతున్నాడు. సదరు మహిళపై కిరోసిన్ పోసి అతను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీ: సీబీఐ కి పిర్యాదు చేసిన వైఎస్ షర్మిల
తెలంగాణ లో ప్రాజెక్ట్ ల పేరుతో జరిగిన అవినీతి పై పిర్యాదు చేసిన వైఎస్ షర్మిల
విచారణ జరిపించాలని వినతి పత్రం ఇచ్చిన వైఎస్ షర్మిల
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల అవినీతి - వైఎస్ షర్మిల
మెగా కంపెనీ తో కలిసి లక్ష కోట్ల అవినీతి - వైఎస్ షర్మిల
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సిఎం కేసిఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ, స్థానిక నాయకులు కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా.. రాజోలు.
మూడు రాజధానులు కోసం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు
మలికిపురం లో కనకదుర్గమ్మ ఆలయంలో ఎమ్మెల్యే రాపాక మూడు రాజధానులకు మద్దతుగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలందరూ మద్దతు తెలియజేస్తున్నారని, పరిపాలన వికేంద్రీకరణను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడంతో ఆంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఈ రాజకీయ వికేంద్రీకరణ ద్వారా, మూడు రాజధానుల నిర్మాణంతో ప్రజలకు మేలు చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నిక కు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు ముందే నగదు లభ్యమైంది. నామినేషన్ల మొదటి రోజే మునుగోడు నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ లోనూ భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. జూబ్లీహిల్స్ లో 50 లక్షల రూపాయలు కారులో తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈ నగదుకు ఎన్నికల ప్రచారానికి సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
వైయస్సార్ జిల్లాలో ఉదృతంగా ప్రవహిస్తున్న పాపాగ్ని నది
కడప- తాడిపత్రి ప్రధాన రహదారి రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు
వరద నీటి ఉద్ధృతికి నదిలో కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు
కమలాపురం ప్రజలకు దారి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరోసారి సోదాలు నిర్వహిస్తున్న ఈడీ.
ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్ లలో సుమారు 35 ప్రదేశాల్లో సోదాలు
ఈ తెల్లవారు జాము నుంచే సోదాలు చేపట్టినట్లు ఈడీ కేంద్ర కార్యాలయ వర్గాల వెల్లడి
Background
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగనున్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని అన్ని పార్టీల నేతలు భావిస్తున్నారు. నేటి (అక్టోబర్ 7) నుంచి మునుగోడు ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఉపరితల ఆవర్తనం ఏపీలోని కోస్తా తీరంతో పాటు ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య భాగాలలో సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సీజన్‌లో చివరిసారి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 6 నుంచి 9 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. గురువారం సైతం పలు జిల్లాల్లో చిరు జల్లులు, మోస్తరు వర్షాలు కురిశాయి. గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచననున్నాయి.
అక్టోబర్ 7 న వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడ్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీపై అల్పపీడనం ప్రభాంతో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు పడతాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో పిడుగులు పడతాయని హెచ్చరించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
మహారాష్ట్రలో కొనసాగుతున్న అల్పపీడనం బంగాళాఖాతంలో నుంచి తేమను కోస్తాంధ్రలోని మధ్య భాగాలైన ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు భాగాల్లోకి వస్తోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం మరింత బలపడటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం వలన మంచి తేమ చేరడంతో రాయలసీమ జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి కడప జిల్లాలోని ఉత్తర భాగాలు, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పరిసరాలు, సత్యసాయి జిల్లా పుట్టపర్తి - కదిరి వైపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగనున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -