Multipurpose Health Assistant, Jobs 2023:
- 1520 మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) పోస్టుల భర్తీ
- నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు
- ఆగస్టు 25 నుంచి దరఖాస్తులు ప్రారంభం 
- సెప్టెంబర్‌ 19వ తేదీ వరకు తుదిగడువు
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. వైద్యారోగ్య శాఖలో 1520 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను వైద్యారోగ్యశాఖ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు విడుదల చేసింది. మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో ఈ పోస్టులు భర్తీ చేస్తారు.  మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mhsrb.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


ఆగస్టు 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆరోజు ఉదయం 10.30 గంటల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌ 19 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తాజాగా నోటిఫికేషన్ పై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. హెల్త్‌ అండ్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ మేళా కొనసాగుతుందన్నారు. మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పై హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన వారు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు.






ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించారు. వాస్తవానికి జులై 26 సాయంత్రంతో ముగియాల్సి గడువును జులై 27 సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,872 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా, వారిలో 12,432 మంది ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత సీట్లు పొందిన అభ్యర్థుల మెరిట్ జాబితాను యూనివర్సిటీ ప్రకటించనుంది. తదనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి 3856 ఎంబీబీఎస్ సీట్లను, 819 బీడీఎస్ సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ జులై 21న ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial