MLC Kavitha :   తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే ఇతివృత్తంలో భాగంగా కీలకోపన్యాసం చేయాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పంపింది.  గత పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని ఆకర్షించాయి. ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్‌లో పర్యటించిన సమయంలో యూనివర్సిటీ విద్యార్థులతో కల్వకుంట్ల కవితతో భేటీ అయిన విషయం తెలిసిందే. దాంతో తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై ఈ నెల 30వ తేదీన ప్రసంగించాల్సిందిగా కోరుతూ యూనివర్సిటీ ఆహ్వానం పంపింది.         

  


తెలంగాణ అభివృద్ధిపై ఆక్స్‌ఫర్డ్ లో ప్రసంగం                                        


ఆక్స్ ఫర్డ్ విద్యార్థులను ఉద్దేశించి  సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పన పై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించనున్నారు. ఒక్కొక్క పథకం అమలు వెనక ఎంత ప్రయోజనం ఉందో చెప్పడమే కాకుండా సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపమే తెలంగాణ అభివృద్ధి అని అంతర్జాతీయ వేదికపై కవిత చాటి చెప్పనున్నారు. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలకు అంతర్జాతీయంగా తెలిసేలా కవిత వివరించనున్నారు. 


తెలంగాణ ఎన్నికల నుంచి టీడీపీ వైదొలిగిందా ? - నిజమేంటో చెప్పిన కాసాని జ్ఞానేశ్వర్ !


వ్యవసాయ రంగం పురోగమించిన తరుపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్                                 


తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై కవిత ప్రసంగిస్తారు. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీళ్లును సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. వైద్య, విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్సిటీలో కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు.


ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ - నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసిన పురందేశ్వరి !


గతంలో కూడా పలు అంతర్జాతీయ సంస్థల సదస్సులకు ఆహ్వానాలు           
 
గతంలో కూడా ఎమ్మెల్సీ కవిత అనేక అంతర్జాతీయ సంస్థల ఆహ్వానం మేరకు వివిధ సదస్సుల్లో పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిని వివరించారు.  భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను  అంతర్జాతయ సంస్థలు గుర్తిస్తున్నాయి.