Congress Tungaturty MLA: మద్యం దుకాణం యజమానులను ఇంటికి పిలిచి..డబ్బులు డిమాండ్ చేసినట్లుగా ఓ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏ ఎమ్మెల్యే ఉన్నారో వీడియోల్లో లేదు. అయితే అది తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్న ప్రచారం జరిగింది. దీనిపై ఎమ్మెల్యే స్పందించారు.
తన వీడియో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తనకు పెరుగుతున్న ప్రజాదరణ తట్టుకోలేక ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇదన్నారు. ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టం లేకనే నా పైన కుట్రలు చేస్తున్నారని.. నా ఇంట్ల తిని నాకే విషం పెట్టి వెళ్ళారని వైన్స్ యజమానులపై మండిపడ్డారు.
తీన్మార్ మల్లన్న నాకు ఫోన్ చేసి నీ వీడియోలు ఇంకా ఉన్నాయని నన్ను బెదిరిస్తున్నాడు, అన్ని వీడియోలు మడిచి ఎక్కడైనా పెట్టుకోమని చెప్పానన్నారు. నన్ను బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేయడానికి తీన్మార్ మల్లన్న మనుషులు చేసిన కుట్రలో భాగంగానే నా మాటలు వక్రీకరించి వీడియో తీశారని ఆరోపించారు. ఇంకోసారి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే తొక్కుతానని హెచ్చరించారు.
ఆ వీడియోలో ఏముందంటే
ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా.. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని లిక్కర్ సిండికేట్లతో జరిగిన సమావేశంలో మందుల సామేల్ అంటున్నట్లుగా ఉంది. రోజు లక్ష రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదని స్పష్టం చేశారు. ఒక్కో రోజు కారులో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు ఉండట్లేదని వాయిస్ వినిపిస్తోంది. అదే సమయంలో ‘సహకరిస్తే ఓకే.. మాట వినకపోతే సంగతి చూస్తా’ అంటూ అందులో ఆడియో ఉంది.
ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యేల దందాలు బయట పడుతున్నాయన్నారు.