ఒక మంత్రి.. సామాన్యురాలిగా షాపింగ్ కు వస్తే... పక్కనే కూర్చుని కబుర్లు చెప్తే... షాపులో వస్తువులు స్వయంగా కొంటే... ఆ షాపులో వాళ్లు ఎలా ఫీలవుతారు..? రంగారెడ్డి  కూడా కందుకూరులో ఇదే జరిగింది. కందుకూరు మార్కెట్‌ సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి... కాసేపు మార్కెట్‌ అంతా తిరిగి చూశారు. ఆ తర్వాత  జడ్పీ చైర్‌పర్సన్‌ అనితతో కలిసి కూరగాయలు అమ్మే మహిళ దగ్గరకు వెళ్లి... ఆమెను ఆప్యాయంగా పలకరించారు. పక్కనే కూర్చొ.. కురగాయాలు కొనుగోలు చేశారు.  బేరమాడి... కాకరగాయాలు, ఆకుకూరలు తీసుకున్నారు. 


ఒక మంత్రి స్వయంగా తన షాపుకు వచ్చి కూరగాయాలు కొనడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కూరగాయాలు తూకం వేస్తూ...  సంబరపడిపోయింది ఆ మహిళ. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక సామాన్య మహిళగా... కూరగాయాలు అమ్మే మహిళ పక్కనే కూర్చుని... చేతులు కలిపి మరీ మాట్లాడారు.  దీంతో సబితమ్మ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది కూరగయాలు అమ్మే మహిళ. తమ కోసం ఒక మంచి మార్కెట్‌ నిర్మించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈమెతోనే  కాదు.. మార్కెట్ మొత్తం తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసే మహిలందరితో ఆప్యాయంగా మాట్లాడారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.


కందుకూరు మార్కెట్‌ సముదాయమేకాదు... పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కందుకూరు, చిన్న రోడ్డు నుంచి ఫార్మాసిటీ వరకు బీటీ రోడ్డు  పనులకు శంకుస్థాపన చేశారు. కందుకూరు, కొత్తగూడ గ్రామాలకు చెందిన 300మంది నిరుపేదలకు ఇంటి స్థలాల సర్టిఫికెట్లను జడ్పీ చైర్‌పర్సన్‌ అనితతో కలిసి అందజేశారు.  9ఏళ్లలో కందుకూరు, మహేశ్వరం, మండలాలతో పాటు నియోజకవర్గం పరిధిలోని అర్బన్‌ ప్రాంతాల్లో శరవేగంగా అభివృద్ధి జరిగిందన్నారు సబితారెడ్డి. రంగారెడ్డి జిల్లాపై సీఎం  కేసీఆర్‌ ఎంతో అభిమానం ఉందని.. అందుకే దాసర్లపల్లి గేటు వరకు మెట్రో రైలు సౌకర్యం కల్పించడానికి నిధులు కూడా మంజూరు చేశారని చెప్పారు. 


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తోందని చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తమ పార్టీపై ప్రజలు చూపిస్తున్న ఆధరణను తట్టుకోలేక ప్రతిపక్షాలు అబద్ధపు  ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరగా... కందుకూరులో కుమ్మరి సంఘం ఏర్పాటు చేసిన కవయిత్రి మొల్ల విగ్రహాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి  ప్రారంభించారు మంత్రి సబితారెడ్డి. కవయిత్రి మొల్ల చేసిన సేవలు మరుపురానివని అన్నారు. రామాయణాన్ని తెలుగులో అనువదించిన తొలి మహిళ ఆమె అని చెప్పారు  మంత్రి సబితా ఇంద్రారెడ్డి.