Minister Ponguleti Key Comments On Panchayat Elections In Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasreddy) కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 15 లోపే పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన వైరా కార్యకర్తల సమావేశంలో 'ఎన్నికలు వస్తున్నాయ్.. జాగ్రత్త' అంటూ కార్యకర్తలకు సూచించారు. కాగా.. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నత స్తాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చింది. ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామంటూ పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం అధికారులు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది.
అటు, కులగణనపై నివేదిక కేబినెట్ సబ్ కమిటీకి ఆదివారం అందింది. దీనిపై కేబినెట్‌లో చర్చించాక.. 5వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. కేంద్ర ప్రభుత్వానికి పంపే వీలుంది. అయితే, కేంద్రం స్పందన ఏమైనా.. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుని.. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలనే కార్యాచరణతో సర్కారు ఉన్నట్లు సమాచారం.