Indiramma Housing Scheme 2025 : రాష్ట్రంలో నిరాశ్రయులైన పేదలందరి సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తీసుకొచ్చిన పథకమే ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం (Indiramma Housing Scheme). ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒకటైన ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రజలకు ఇల్లు, భూమి అందిస్తుంది. సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22,000 కోట్ల బడ్జెట్‌తో మొత్తం 4.5 లక్షల ఇళ్లను నిర్మించేందుకు సిద్ధమైంది. దీని కోసం రాష్ట్ర అధికారులు 2025 జనవరి 16 - 25 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత మార్పులు జనవరి 26 నుంచి అమలు చేస్తున్నారు. ఇక ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే కొందరిని ఎంపిక చేసింది. ఈ జాబితాను సైతం ఆన్లైన్‌లో అందుబాటులో ఉంచింది. మరి ఈ జాబితాలో మీ పేరు కూడా ఉందో, లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://indirammaindlu.telangana.gov.in/ లోకి వెళ్లాలి.
- అనంతరం హోమ్ పేజీలోని చెక్ లిస్ట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే కొత్త పేజీలో అడిగిన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీరు పథకానికి ఎంపికయ్యారో లేదో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఈ లిస్టులో మీ పేరు కనిపించకపోతే మరోసారి అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది. అయితే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే,
ఎలా అప్లై చేసుకోవాలంటే..?
- ముందుగా అధికారిక వెబ్ సైట్ https://indirammaindlu.telangana.gov.in/ ను సందర్శించి, apply onlineపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు స్క్రీన్‌పై కనిపించే అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన వివరాలను అందించి, అవసరమైన పత్రాలను జత చేయాలి.
- ఆ తర్వాత రివ్యూ చేసి, సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
యాప్‌లో ఎలా అప్లై చేయాలంటే.?
- ఇందిరమ్మ ఇల్లు హౌసింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మొబైల్ యాప్ INDIRAMMA INDLU ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- యాప్ ఓపెన్ చేసి, అడిగిన ఆధారాలు (రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్..)ను నమోదు చేయాలి.
- ఇప్పుడు మీరు అందించిన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, లాగిన్ అవ్వాలి,
- తర్వాత apply now అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇక్కడ అడిగిన అన్ని వివరాలను నమోదు చేసి, అవసరమైన పత్రాలను జత చేసి, సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
కావల్సిన పత్రాలు
- ఆధార్ కార్డ్
- మొబైల్ నంబర్
- విద్యుత్ బిల్లు
- అడ్రస్ ప్రూఫ్
- పాన్ కార్డు
- రేషన్ కార్డు
హెల్ప్‌లైన్ నంబర్
ఫోన్ నంబర్:- 040-29390057