Minister Malla Reddy Dance : మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు వార్తల్లో ట్రెండ్ అవుతుంటారు. ఆయన మాట్లాడితేనే పూనకాలు లోడింగ్..మరీ డ్సాన్స్ చేస్తే మామూలుగా ఉంటుందా. అందులోనూ డీజే టిల్లు పాటకు ఆ సినిమా హీరోతోనే సిగ్నేచర్  స్టెప్పులేసి ఔరా అనిపించారు. 


తగ్గేదేలే అంటున్న మంత్రి మల్లారెడ్డి


పొలిటికల్ లీడర్స్ లో మంత్రి చామకూర మల్లారెడ్డి అందరికంటే సమ్ థింగ్ స్పెషల్.  ఏజ్ బార్ అయినా యూత్ కి ఏమాత్రం తీసిపోకుండా ఆయన యాటిట్యూడ్ చూపిస్తుంటారు. ఆయన మాట్లాడినా, డాన్స్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా డీజే టిల్లు సాంగ్ కి ఏకంగా ఆ సినిమా హీరోతోనే స్టెప్పులేశారు. ఆటైనా, పాటైనా, డాన్సైనా తగ్గేదేలే అంటున్నారు మంత్రి మల్లారెడ్డి. 






మంత్రి మల్లారెడ్డి స్టెప్పులతో పూనకాలు లోడింగ్


మంత్రి మల్లారెడ్డి మామూలుగా మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే జనాల్లో పూనకాలు లోడింగ్ అవుతుంటాయి. అలాంటిది డీజే టిల్లు సాంగ్ కి స్టెప్పులేస్తుంటే అక్కడున్న వాళ్లంతా ఊగిపోయారు. అది కూడా డీజే టిల్లు సినిమా హీరో జొన్నలగడ్డ సిద్దూతో కలిసి మల్లారెడ్డి రెచ్చిపోయారు. హీరో సిద్దూ ఏమాత్రం తీసిపోకుండా ధూంధాంగా డాన్స్ చేశారు. యూత్ కి ఏమాత్రం తీసిపోకుండా అదుర్స్ అనిపించారు. 


హీరో సిద్దూతో కలిసి మంత్రి మల్లారెడ్డి సిగ్నేచర్ స్టెప్పులు


మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి నిర్వహించిన ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా డీజే టిల్లు హీరో జొన్నలగడ్డ సిద్దూ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాగ్ కూడా అటెండయ్యారు. స్టేజీపై డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు  హీరో సిద్ధూతో పాటు మంత్రి మల్లారెడ్డి స్టెప్పులేశారు.  హీరో సిద్ధు మంత్రి మల్లారెడ్డితో సిగ్నేచర్ స్టెప్పులు కూడా వేయించారు. కాసేపు వేదికపై ఇద్దరూ డాన్స్ చేసి జోష్ నింపారు. మంత్రి, హీరో కలిసి చేసిన ఈ డాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 


డీజే టిల్లు స్టెప్పులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్


వేడుక ఏదైనా మంత్రి మల్లారెడ్డి చేసే హంగామా మామూలుగా ఉండదు. మాస్ సాంగ్స్ కు స్టెప్పులేసి అందరిని అలరిస్తుంటారు. ఇలానే మరోసారి స్టెప్పులేస్తూ మంత్రి మల్లన్న ట్రెండ్ అవుతున్నారు. అప్పట్లో మునుగోడులో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ జరిగినప్పుడు హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లిన మల్లారెడ్డి..తెలంగాణ పాటలకు తీన్మార్ స్టెప్పులేసి ఉత్సాహాన్ని నింపారు. తన కారు సన్ రూఫ్ నుంచి స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యారు. ఇలా చాన్స్ వస్తే తనదైన స్టైల్లో జనాలకు అలరిస్తుంటారాయన. అట్లుంటది మనతోటి అంటూ నిరూపిస్తుంటారు. 


మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన సంక్రాంతి ఈవెంట్లో వేలాదిగా స్టూడెంట్స్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్  నిర్వహించారు. భారీ ఎత్తున ముగ్గులు పోటీ నిర్వహించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు.