Minister KTR: రాబోయే ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా సరే గెలవాలని కసరత్తులు మొదలు పెట్టింది. ఇప్పటికే పలు సర్వేలు కూడా చేసింది. అయితే ఇప్పటికే రెండు సార్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కారణంగా వచ్చే సహజమైన వ్యతిరేకతతో కొంత మందిని మార్చాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై ఇప్పుడే ఏం చెప్పలేమని అన్నారు. అలాగే పని తీరు బాగున్న వాళ్లకే మళ్లీ టికెట్ దక్కుతుందని వివరించారు. వెనుకబడిన ఎమ్మెల్యేలు పని తీరు మార్చుకోవాలని చెప్పారు. పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం ఎళ్ల వేళలా కృషి చేసే వాళ్లందరిపై పార్టీ అధినేత ఓ కన్నేసి ఉంచారని వివరించారు.


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసి ఇప్పటి వరకు ఎలాంటి అదృష్టానికి నోచుకోని వాళ్లు.. అలా వివిధ రకాల నేతలు యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకొని మరింత స్ట్రాంగ్ అయిందని... ఇక రెండోసారి జరిగిన ఎన్నికల్లో 88 స్థానాలు గెలిచి ప్రతిపక్షాల నుంచి మరికొంత మందిని పార్టీలోకి తెచ్చుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. న్యూ స్ట్రాటజీలో భాగంగా ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని వాళ్లని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నంలో వారికి మ్మెల్సీ పదవులు ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సీఎం కేసీఆర్ సరికొత్త పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో, ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.