నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్ గణేష్ మండపం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని భక్తులతో కలిసి నృత్యాలు చేశారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి అలాగే జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ కూడా భక్తులతో నృత్యాలు చేసి అలరించారు.


నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏటా చేస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా మాట్లాడుతూ.. శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట గణేష్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జన శోభాయాత్రను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం శోభాయాత్రను పురస్కరించుకొని భక్తులతో కలిసి నృత్యాలు చేశారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని వెల్లడించారు. నిమజ్జన శోభాయాత్ర కోసం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డితో పాటు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.