Meenakshi Natarajan AICC:  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలకు మొదటి సందేశం ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రభుత్వం లో ఉన్నాం.. పేద వాడి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. పేదల మొఖంలో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్లని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉంది.. అనేక రకాలుగా పోరాటాలు చేశాము.. అందుకే తెలంగాణ లో అధికారంలోకి వచ్చామన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జొడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారు. మనం దాని కోసం పోరాటం చేయాలన్నారు.              

బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో మనం ఇక్కడ పోరాటం చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చింది... కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయిన సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలన్నారు. పదేళ్లు గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారన్నారు. వారికి న్యాయం జరగాలి.. పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలన్నారు. మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలన్నారు. 

దేశంలో ఎక్కడా లేని విదంగా ఇక్కడ కులగణన చేపట్టాము.. ఇది చాలా గొప్ప విషయమన్నారు. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి.  ఈ విషయంలో పీసీసీ ఒక పకడ్బందీగా కాలెండర్ సిద్ధం చేయాలన్నారు.            

మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ. ఆమె ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఆమె కోసం ఎవరు ఏమైనా హడావుడి చేసినా అంగీకరించరు. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జా నియమితులు అయిననప్పటికీ .. రైతులలో హైదరాబాద్ వచ్చారు. పీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. ఆమె నాయకత్వం, నిరాండంబరత వల్ల రాహుల్ గాంధీ కి అనుచరురాలిగా గుర్తింపు పొందారు. జాతీయ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఇటీవలి కాలం వరకూ దీపాదాస్ మున్షి ఇంచార్జ్ గా ఉండేవారు. ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం కావడంతో  పార్టీ హైకమాండ్ మార్పు చేసింది. 

మీనాక్షి నటరాజన్ చాలా నిక్కచ్చిగా ఉంటారని..లాబీయింగ్ లాంటి వాటికి అసలు ప్రోత్సహించరని చెబుతారు. పార్టీ కోసం కష్టపడేవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని చెబుతారు. కాకా పట్టి పదవులను సిఫారసు చేయించుకునేవారిని దూరం పెడతారని చెబుతారు. ఈ క్రమంలో ఆమె ఇంచార్జ్ గా రావడంతో కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నాయి.  తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఆమె సేవలు అందించారని.. అభ్యర్థుల మధ్య సమన్వయానికి పని చేశారని రేవంత్ చెబుతున్నారు.  తెలంగాణ రాష్ట్రం మీనాక్షి నటరాజన్ కు కొత్త కాదని.. భావిస్తున్నారు.