Just In





Good Bad Ugly Teaser: అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
Ajith Kumar's Good Bad Ugly Teaser: అజిత్ కుమార్, త్రిష జంటగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ విడుదలైంది. ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో మాసీగా ఉంది.

మాస్... అజిత్ కుమార్ మాస్... ఆయన నుంచి ఫ్యాన్స్ అందరూ కోరుకునేది ఇది కదా అన్నట్టు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ యూట్యూబ్‌లోకి వచ్చింది. మరి, ఆ టీజర్ ఎలా ఉందో చూడండి.
అజిత్ మాస్... వాట్ ఎన్ ఎనర్జీ సర్జీ!
Good Bad Ugly Teaser Review: 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అందరినీ ఎక్కువగా సర్‌ప్రైజ్ చేసిన, అట్ట్రాక్ట్ చేసిన పాయింట్... హీరో అజిత్ కుమార్ లుక్. కొన్నాళ్లుగా ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మైంటైన్ చేస్తున్నారు. అయితే... ఈ టీజర్‌లో లుక్కుకు తోడు కాస్ట్యూమ్స్ వైబ్రెంట్ అండ్ కలర్ ఫుల్ ఫీల్ ఇచ్చాయి. అజిత్ క్లీన్ షేవ్, బ్లాక్ హెయిర్ లుక్ కూడా బావుంది. ఒక షాట్ అయితే 'బిల్లా'ను గుర్తు చేసింది. ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా అనేది అర్థం అవుతోంది. ఇక, అజిత్ మాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా లేదు... ఫ్యాన్స్ అంతా విజిల్స్ వేసేలా ఉంది. అజిత్ ఎనర్జీ అభిమానులు అందరికీ నచ్చుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం కూడా అజిత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది.
Also Read: రామ్ చరణ్ సినిమాలో అతిథిగా మెగాస్టార్ చిరంజీవి... అందులో నిజం ఎంతంటే?
అజిత్, త్రిష కలయికలో ఆరో సినిమా
'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్ సరసన సౌత్ క్వీన్ త్రిష నటిస్తున్నారు. ఆవిడ రమ్య పాత్ర పోషిస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇటీవల లుక్ కూడా విడుదల చేసింది. 'కిరీదం', 'జి', 'గ్యాంబ్లర్' (తమిళంలో 'మంకత్తా'), 'ఎంత వాడు గాని' (తమిళంలో 'ఎన్నై ఆరిందాల్'), ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'విడా ముయర్చి' తర్వాత వాళ్లిద్దరి కలయికలో తెరకెక్కుతోన్న ఆరో సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.
ఏప్రిల్ 10న థియేటర్లలోకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'
Good Bad Ugly Release Date: 'గుడ్ బ్యాడ్ అగ్లీ'ని తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ప్రొడ్యూసర్లు. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 10, 2025న తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నారు. 'మార్క్ ఆంటోని' విజయం దర్శకుడు అధిక్ రవిచంద్రన్ చేస్తున్న సినిమా కావడంతో తమిళ ప్రేక్షకుల్లో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
Good Bad Ugly Cast And Crew: అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ జంటగా నటిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్ సునీల్ కీలక తారాగణం. ఈ చిత్రానికి స్టంట్స్: సుప్రీం సుందర్ - కలోయన్ వోడెనిచరోవ్, ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి, ప్రొడక్షన్ డిజైనర్: జీఎం శేఖర్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం, సీఈవో: చెర్రీ, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని - వై రవిశంకర్, రచన - దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్.