Breaking News Live: ఓటీఎస్ పై ఎమ్మెల్యే రోజాకు నిలదీసిన స్థానికులు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 16 Feb 2022 10:07 PM

Background

భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న కారణంగా గత 30 సంవత్సరాలుగా సముద్రపు వేడిగాలులు అధికమయ్యాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుంది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. దాంతో వాతావరణంలో స్వల్ప...More

ఓటీఎస్ పై ఎమ్మెల్యే రోజాకు నిలదీసిన స్థానికులు 

చిత్తూరు జిల్లా నగిరి‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. నిండ్ర మండలం అగరం పేటలో మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే  రోజాను ఓటీఎస్ పై స్థానిక లబ్ధిదారులు నిలదీశారు. మేము గతంలో ఎప్పుడో నిర్మించుకున్న ఇంటికి ఎందుకు పది వేలు చెల్లించాలని ఎమ్మెల్యే రోజాను లబ్ధిదారురాలు అడుగగా మీరు పది వేలు చెల్లిస్తే ఇల్లు మీ సొంతం అవుతుందని తెలిపారు.  మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు, బ్యాంకులో మీరు అర్హులవుతారు ఆ ఇంటి పై సర్వ హక్కులు మీకు లభిస్తాయి అంటూ తమిళంలో నగిరి ఎమ్మెల్యే రోజా లబ్ధిదారులకు సమాధానమిచ్చారు.