Medak Realtor Murder Case Live Updates: ముగ్గురు నిందితుల గుర్తింపు.. హత్యకు కారణం ఏంటంటే..

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు తొలుత వివాహేతర సంబంధం కారణమని ప్రచారం జరిగింది. కానీ అది కారణం కాదని పోలీసులు తేల్చారు. ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని పోలీసులు ధ్రువీకరించారు.

ABP DesamLast Updated: 11 Aug 2021 11:00 AM

Background

మెదక్ జిల్లాలో హత్యకు గురైన ధర్మాకర్ శ్రీనివాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కేసును పోలీసులు ఛేదించారు. తొలుత వివాహేతర సంబంధం ఈ హత్యకు కారణమని ప్రచారం జరగ్గా అది కారణం కాదని విచారణలో పోలీసులు తేల్చారు. ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని...More

ముగ్గురు వ్యక్తులు నిందితులు

శ్రీనివాస్‌ను కారులోనే కత్తితో పొడిచి చంపిన నిందితులు.. దాదాపు ఆరు గంటల పాటు ఆ కారులోనే తిరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. అయితే, వారు లోన్ తీసుకొని శ్రీనివాస్‌కు అప్పు ఇచ్చినా.. ఆయన తిరిగి ఇవ్వలేదని అందుకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.