Medak Collector Turned As a Farmer: ఆయన ఓ జిల్లా కలెక్టర్. ఎప్పుడూ అధికారులతో సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో బిజీగా గడుపుతుంటారు. అలాంటిది ఆదివారం ఆటవిడుపుగా పొలం బాట పట్టారు. తన సతీమణి, ఇద్దరు కుమార్తెలతో కలిసి వరినాట్లు వేశారు. మెదక్ (Medak) జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (Rahul Raj), ఆయన సతీమణి శ్రీజ రైతులుగా మారారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న ఓ రైతు పొలంలో దిగి వరినాట్లు వేశారు. వారి ఇద్దరు కుమార్తెలు సైతం ఉత్సాహంగా మట్టిలో దిగి వారికి సాయం చేశారు. అనంతరం కలెక్టర్ దంపతులు స్థానిక రైతులు, కూలీలతో ముచ్చటించారు. స్థానికంగా రైతుల పొలాలు పరిశీలించి సాగు పద్ధతులు, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలో వచ్చే లాభాలు వంటి అంశాల గురించి తెలుసుకుని సూచనలు చేశారు. కలెక్టర్ దంపతులే స్వయంగా పొలంలో దిగి నాట్లు వేయడం, తమ సమస్యలు తెలుసుకోవడం పట్ల స్థానిక రైతులు, కూలీలు హర్షం వ్యక్తం చేశారు.


Also Read: Telangana : తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి- ప్రవాస పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ పిలుపు