Telangana News: మంచిర్యాల నగరం నడి బొడ్డున గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ రీతిలో నడుస్తున్న వ్యభిచార రాకెట్ ను మంచిర్యాల పోలీసులు గుట్టురట్టు చేసారు. మంచిర్యాల కేంద్రంలోని ఏసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ప్రకాష్ వివరాలను వెల్లడించారు. ఎల్ఐసీ ఆఫీసు సమీపంలో ఇంట్లో గత కొంత కాలంగా అత్యంత గోప్యంగా నడుస్తున్న ఈ వ్యభిచారం గృహంపై మంచిర్యాల సీఐ బన్సీలాల్ తన సిబ్బందితో చాకచక్యంగా దాడి చేసి కొంత మంది విటులను అదుపులో తీసుకున్నారని తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల పట్టణం చున్నం భట్టి వాడకు చెందిన కరుణాకర్ అనే వ్యక్తి షార్ట్ ఫిల్మ్ పేరుతో ఆర్థికంగా ఈబ్బందులు ఎదుర్కొంటున్న అందమైన యువతులను మాయమాటలతో మోసం చేసి వారిని వ్యభిచారంలోకి దింపి వారి జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నాడని తెలిపారు. కరుణాకర్ బెల్లంపల్లి కి చెందిన మరో వ్యక్తిని మేనేజర్ గా పెట్టుకొని అతని ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల వారికి వాట్సప్ ద్వారా ఈ అమ్మాయిల ఫోటోలు షేర్ చేస్తూ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో మంచిర్యాల సీఐ బన్సిలాల్ చాకచక్యంగా దాడి చేసి ఏడుగురు విటులను అరెస్టు చేశారు. వారు నవీన్ బెల్లంపల్లి, దేవ పోషమల్లు, గండి రమేష్ రామకృష్ణ పూర్, కొలిపాక రాజశేఖర్ హామలివాడ, గొల్లపల్లి శేఖర్, నస్పూర్ తో పాటు రూ.12 వేల రూపాయలను, ఏడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు.