Mancherial News : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి వరదలో చిక్కుకున్న ఇద్దరి వ్యక్తులను గురువారం హెలికాప్టర్ ద్వారా రక్షించారు. బుధవారం మేకలను కాసేందుకు వెళ్లిన కాపరులు వెనక్కి వచ్చే సమయంలో వరద ముంచెత్తింది. దీంతో వారిద్దరూ అక్కడున్న వాటర్ ట్యాంక్ ఎక్కేశారు. వరద ఉద్ధృతి తీవ్రం కావడంతో ఎవరు వారిని కాపాడే సాహసం చేయలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వారిని కాపాడడానికి మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. హుటాహుటిన హెలికాప్టర్ ను తెప్పించి ఇద్దరిని తరలించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. హెలికాప్టర్ ద్వారా తమని కాపాడినందుకు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి కేటిఆర్ లకు కాపరులు ధన్యవాదాలు తెలిపారు. 


వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీ పర్యటన 


మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ ఉన్న గోదావరి బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. చుట్టూ పక్కల 2 కిలోమీటర్ల మేర నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ అధికారులతో కలిసి గోదావరిఖని గంగానగర్, ఇందారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పరిస్థితులను పరిశీలించారు. బ్రిడ్జ్ పై వాహనాలను అనుమతించ కూడదని తెలిపారు. బ్రిడ్జ్ కు ఇరువైపుల నుంచి వరద నీరు ప్రవహిస్తుంది కావున వాహనాలు దారి మళ్లించాలని, అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉంటూ అప్రమత్తంగా వ్యవహారించాలని సీపీ సూచించారు.



వరదలో బహుబలి సీన్


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాహుబలి సీన్ రిపీట్ అయింది. మూడు నెలల బాబును వరదల నుంచి కాపాడుకోవడానికి మంథని పట్టణంలోని మరివాడలో ఉన్న ఓ వ్యక్తి బాబును పళ్లెంలో బాబును పెట్టుకుని మెడలోతు నీటిలో సురక్షితంగా తీసుకొని వెళ్లాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ బాబును చేతితో పట్టుకుంది. అది  గ్రాఫిక్స్ అయితే ఈ సీన్ నిజంగా జరిగిందని కొందరు నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్ చేస్తున్నారు. 



Also Read : Rains Effect: ఆరో రోజూ ఇందూర్ లో వరుణుడి బీభత్సం.. ఉగ్రరూపం దాల్చిన గోదావరి!


Also Read : Godavari Floods: ఆ వరదలతో ఒక తరమంతా నాశనం! తలచుకుంటేనే వెన్నులో వణుకు - చరిత్రలోనే అదొక చేదు జ్ఞాపకం