Majlis MLA Akbaruddin: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక రాజకీయ ఉత్కంఠ రేపుతున్న సమయంలో AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేారు. "రెడ్డి లేదా రావు.. తాము ఎవరికీ అనుచరులం కాదని.. ఎవరు పరిపాలించినా హైదరాబాద్ పై పెత్తనం తమ చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు.
జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మకం అయ్యారని .. ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు పాట్లు పడుతున్నాయి. ముస్లిం వర్గాల్లో మంచి పట్టు ఉన్న మజ్లిస్ ఈ సారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతోంది. నవీన్ యాదవ్ ను గెలిపించాలని అసదుద్దీన్ ఓవైసీ గతంలో ఓ సారి ప్రకటన చేశారు. అయితే మజ్లిస్ నేరుగా ప్రచారంలో పాల్గొనడం లేదు.
మజ్లిస్ పార్టీ విధానం ప్రకారం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటుంది. కేసీఆర్ తో కలిసి పదేళ్ల పాటు కలసి మెలిసి రాజకీయాలు చేశారు. ఆ పార్టీ ఓడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి దూరమై కాంగ్రెస్ పార్టీకి సన్నిహితమయ్యారు. పాతబస్తీలో మరో పార్టీ బలపడకుండా.. తమ బలం కాపాడుకునేలా మజ్లిస్ ఈ రాజకీయాలు చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర పార్టీలు బలపడకుండా చూసుకుంటాయి.
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించకపోతే .. ఆ పార్టీ మజ్లిస్ బచావో తెహరిక్.. ఎంబీటికి మద్దతు ఇస్తే.. మజ్లిస్ కు పాతబస్తీలో గట్టి సవాల్ ఎదురవుతుంది. ఇటీవలి ఎన్నికల్లో ఎంబీటీకి మంచి ఓట్లు వస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా పాతబస్తీపై పెత్తనం చేస్తున్న మజ్లిస్ పై అక్కడి ఓటర్లలో వ్యతిరేకత ప్రారంభమయింది.కానీ ప్రత్యామ్నాయం ఎవరూ ఉండకుండా.. మజ్లిస్ అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగి.. వారికి అవసరమైన మద్దతు ఇచ్చి .. హైదరాబాద్ లో తమ పట్టు మాత్రం కొనసాగిస్తూ ఉంటారు.
ఇప్పుడు కూడా అక్బరుద్దీన్ అదే చెబుతున్నారు.రావు లేదా రెడ్డి తెలంగాణలో ఎవరు సీఎంగా ఉన్నా.. హైదరాబాద్ పై పెత్తనం తమకే ఉంటుందని నేరుగా చెబుతున్నారు. అంటే అధికార పార్టీకి ఓటేయాలని... తమ పెత్తనం పోదని ఆయన ముస్లింలకు సంకేతం ఇచ్చారని అనుకోవచ్చంటున్నారు. అయితే మజ్లిస్ నేరుగా మద్దతు ప్రకటిస్తే.. తమకు ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న కారణంగా ఏమో కానీ కాంగ్రెస్ మాత్రం బహిరంగంగా మజ్లిస్ మద్దతు మాకేనని చెప్పడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ తరపున జూబ్లిహిల్స్ నుంచే పోటీ చేసి.. రెండో స్థానంలో నిలిచారు.