Ram Charan Viral Step In Peddi First Song: మెగా అభిమానులకు 'పెద్ది' టీమ్ ఇవాళ మాంచి మాసీ అప్డేట్ ఇచ్చింది. సినిమాలో ఫస్ట్ సాంగ్ 'చికిరి' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. నవంబర్ 7న పాటను విడుదల చేస్తామని పేర్కొంది. చికిరి పదానికి అర్థం చెప్పింది. ఓ ప్రోమో విడుదల చేసింది. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది.
బాసూ... చరణ్ డ్యాన్సులో ఏంటి ఆ గ్రేసు!Chikiri Chikiri Song Hook Step: 'చికిరి... చికిరి...' పాట ట్యూన్ కంటే, ఆ ప్రోమో చివరిలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ డ్యాన్సులో గ్రేస్ చూశారా? అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుంటే... సాధారణ ప్రేక్షకులు స్టెప్ బావుందని చెబుతూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
రామ్ చరణ్ మాంచి డిజైనర్ డ్రస్ ఏమీ వేయలేదు. సింపుల్ షర్ట్ అండ్ ప్యాంటు వేశారు. మెడలో ఒక కర్చీఫ్ కట్టారు. బీడీ కలుస్తూ కొండ అంచున నిలబడి వేసిన స్టెప్ ప్రజెంట్ ట్రెండింగ్ అవుతోంది.
చిరంజీవి, పవన్ కూడా సేమ్ స్టెప్ వేస్తే?రామ్ చరణ్ వేసిన 'చికిరి చికిరి' హుక్ స్టెప్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేస్తే... ఈ ఆలోచన అభిమానులకు వచ్చింది. ఇక ఆలస్యం ఏముంది? ఏఐ టెక్నాలజీ ద్వారా వాళ్లిద్దరూ కూడా సేమ్ స్టెప్ వేస్తున్నట్లు విజువల్స్ క్రియేట్ చేశారు. చిరంజీవి, చరణ్, పవన్... ఆ ముగ్గురూ 'చికిరి చికిరి' హుక్ స్టెప్ వేస్తున్నట్లు క్రియేట్ చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
Also Read: రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూసినోళ్లు ఏం చెబుతున్నారంటే?
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న 'పెద్ద' చిత్రానికి 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ నటిస్తున్నారు. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న సినిమా విడుదల కానుంది.