నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ వర్సెస్ జూపల్లి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిపోయింది. సవాళ్లకు ప్రతి సవాలు ఎదురు కావడంతో నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ‘నువ్వు ఏం చేశావు నేనేం చేశాను.. అంబేద్కర్ చౌరస్తా కు బహిరంగ చర్చకు వస్తావా’ అని జూపల్లి సవాల్ విసరడంతో అంబేద్కర్ చౌరస్తా కే కాదు నన్ను నేను నిరూపించుకోవడానికి నీ ఇంటికి వస్తాం’ అని హర్షవర్థన్ ప్రతి సవాలు విసిరారు. దీంట్లో భాగంగా నేడు బహిరంగ చర్చకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 


కొల్లాపూర్ నియోజకవర్గంలో భారీగా పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపలా కాస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేసి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.


కొల్లాపూర్ నియోజకవర్గంలో భారీగా పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపలా కాస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేసి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక, నేడు (జూన్ 26) ఉదయం కొల్లాపూర్‌లో జూపల్లి ఇంటి వద్దకు ఆయన అనుచరులు రావడంతో నలుగురిని అరెస్టు చేశారు. అటు, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ ఇంటి వద్ద పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇద్దరు నేతలను పోలీసులు ఇంటికే పరిమితం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఇరు వర్గాల అనుచరులకు వార్నింగ్‌ ఇచ్చారు.


ఒంటిగంట వరకూ చూస్తా: జూపల్లి
ఈ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో తన ఇంటి వద్ద తాను మధ్యాహ్నం ఒంటి గంట వరకూ వేచి చూస్తానని, తర్వాత తానే బయటకు వెళ్తానని జూపల్లి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జూపల్లి ఇంట్లో ఆయన అనుచరులతో కలిసి సమావేశం అయ్యారు. అక్కడే అందరికీ అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇద్దరు నేతల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త వాతావరణం కారణంగా కొల్లాపూర్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.