Lawyer died in Telangana High Court: గుండెపోటు మరణాలు ఇటీవలి కాలంలో ఎక్కవైపోయాయి. అప్పటి వరకూ బాగానే ఉంటారు. కానీ హఠాత్తుగా కుప్పకూలిపోతారు. ఇలాంటి మరణం తెలంగాణ హైకోర్టులోనూ చోటు చేసుకుంది. ఓ కేసు సందర్భంగా ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తున్న పసునూరి వేణుగోపాల్ అనే లాయర్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. గుండెపోటు వచ్చిందని ఇతర లాయర్లు, కోర్టు సిబ్బంది సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే ప్రాణాలు కోల్పోయనట్లుగా వైద్యులు విర్ధారించారు. ఈ ఘటనతో హైకోర్టు ప్రాంగణంలో విషాదం నెలకొంది. లాయర్ మృతి చెందడంతో కోర్టులోకేసుల విచారణలు బుధవారానికి వాయిదా వేశారు.
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
Raja Sekhar Allu | 18 Feb 2025 04:19 PM (IST)
Telangana: తెలంగాణ హైకోర్టులో విషాదం చోటు చేసుకుంది. ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ పసునూరి వేణుగోపాల్ అనే లాయర్ చనిపోయారు.
హైకోర్టులో వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్