KTR Letter To Modi :  కేంద్ర ప్రభుత్వంలో 16లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్.. ప్రధాని మోదీకి లేఖర ాశారు.  ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తామ‌న్న మోదీ.. త‌న హామీని నిల‌బెట్టుకోలేక‌పోయార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ ఇప్పటికే లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉద్యోగ‌, ఉపాధి అవకాశాలను కల్పించామ‌న్నారు. కానీ కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలపై దెబ్బ కొడుతుందని మండిప‌డ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా శాశ్వతంగా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధానమంత్రి విఫలమయ్యారని మండిపడ్డారు.  
 
దేశ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో ప్రధానమంత్రిగా మీరు  విఫలమయ్యారనే భావ‌న నెల‌కొన్న‌దని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్ధానాలు, చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తరువాత మర్చిపోయారన్నారు.  భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విదేశీ పరిశ్రమలను దేశానికి రప్పించే విషయంలో మీకు ఒక స్పష్టమైన విధానం లేదన్నారు.  వ్యవసాయం రంగంతో పాటు, దాని తరువాత అత్యధికంగా ప్రజలు ఆధారపడ్డ టెక్స్ టైల్ రంగ అభివృద్ధిపై మీ ప్రభుత్వానికి చిత్తశుద్ది అసలే లేదని లేఖలో విమర్శించారు.  అందుకే పొరుగున ఉన్న చిన్న దేశాల క‌న్నా త‌క్కువ‌మందికి ఈరంగంలో ఉపాధి ల‌భిస్తున్న‌ది. మన ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఈ రెండు రంగాలను మీరు కావాలని విస్మరించడంతోనే ఇవాళ దేశం మీ ఈ విధానాల వ‌ల‌నే గత 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్న భారత ప్రభుత్వ గణాంకాలే ఇందుకు తిరుగులేని సాక్ష్యమన్నారు. 


దేశానికి పెట్టుబడులను భారీగా రప్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైన మీరు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిద్రపోతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీలతోపాటు పబ్లిక్ సెక్టార్ లోని అనేక కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్ లో పెట్టారు. ఒక వైపు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్న మీరు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అందినకాడికి అమ్ముతూ లక్షలాది ఉద్యోగాలను రద్దు చేస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఖాళీగా ఉన్న 16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మీ నాయకత్వంలోని సర్కార్ ఎప్పుడు భర్తీ చేస్తుందన్నది భేతాళ ప్రశ్నగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  


లేఖలో ఎనిమిది ప్రశ్నలు సంధించి వాటికి సమాధానాలివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని మీరు ఓ వైపు గప్పాలు కొడుతుంటే మీ పార్టీ నేతలు మాత్రం సబ్ కో సత్తేనాశ్ కరో అన్నట్టే వ్యవహరిస్తున్నారన్నారు.  ఈ వైఖ‌రి వ‌ల‌న కేవ‌లం దేశంలోనే కాకుండా వీదేశాల్లోని భార‌తీయుల ఉపాధికి ప్ర‌మాదం ఏర్పడుతున్న‌దని పార్టీ విద్వేష రాజకీయాలతో పారిశ్రామికంగా వెనుకబడే ప్రమాదంలోకి మనదేశం వేగంగా వెళుతోందన్నారు.  ద్రంలో పెండింగ్ లో ఉన్న 16 లక్షల ఉద్యోగాలభర్తీకి  చర్యలు  తీసుకోకపోతే తెలంగాణ యువతతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకువ‌చ్చేలా, ఉద్యోగాల భ‌ర్తీ జ‌రిగేదాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు.