Luxury car smuggling case:  లగ్జరీ కార్లను స్మగ్లింగ్ చేసి సెకండ్ హ్యాండ్ పేరుతో అమ్మి ప్రభుత్వానికి కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేశారన్న కేసులో కార్ల డీలర్ గా ఉన్న బషరత్ ఖాన్ అనే వ్యక్తి ఇళ్లు,కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లో 'కార్ లాంజ్' పేరుతో సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ నిర్వహిస్తున్న  బషరత్ ఖాన్  .. మే 2025లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)  అరెస్టు చేసింది.    అతను USA, జపాన్ నుంచి లగ్జరీ కార్లు  రోల్స్ రాయిస్, హమ్మర్ EV, ల్యాండ్ క్రూజర్ వంటివి  దుబాయ్, శ్రీలంక రూట్‌లో తీసుకొచ్చి సెకండ్ హ్యాండ్ కార్లుగా చూపి.. ప్రభుత్వానికి  25 నుంచి 100 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.  30కి పైగా కార్లు  ఇంపోర్ట్ చేసుకుని వీఐపీలకు అమ్మాడని ఈడీ గుర్తించింది.   BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  కుటుంబసభ్యుల పేరుతో ఉన్న కంపెనీ ద్వారా రిజిస్టర్ నంబర్ TG09D6666తో ఉన్న ల్యాండ్ క్రూయిజర్‌ను  బషరత్ ఖాన్  నుంచి  కొనుగోలు చేశారని ఈడీ గుర్తించింది.  ఈ విషయాన్ని  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్  బయటపెట్టారు.  బషరత్ ఖాన్ ఇంటరోగేషన్‌లో  కేటీఆర్ కుటుంబానికి అమ్మిన కార్ల గురించి చెప్పాడని ఆ కార్లను బ్లాక్  మనీతో  కొన్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

Continues below advertisement

ఈ అంశంపై మీడియా సమావేశంలో కేటీఆర్ ను జర్నలిస్టులు ప్రశ్నించారు. కేటీఆర్ ఈ అంశంపై స్పందించారు. తాను తప్పు చేయలేదని..  అరెస్టు చేసుకుంటే చేసుకోవచ్చని అన్నారు. తాను అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆర్ .. ఎస్ బ్రదర్స్ అంటే .. రేవంత్, సంజయ్ సోదరులు ఎన్ని కుట్రలు చేసిన..తప్పు చేయని తనను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. అయితే ఆ కారును బషరత్ ఖాన్ దగ్గర కొన్నారా  లేదా అన్నది మాత్రం కేటీఆర్ చెప్పలేదు. అలాంటి కార్లను దిగుమతి చేసుకోవాలంటే వంద శాతం పన్నులు కట్టాల్సి ఉంటుంది. అంటే రెండు కోట్ల రూపాయలకు రెండు కోట్ల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది .కానీ పన్నులు లేకుండా తీసుకు వచ్చి .. తక్కువ రేటు..సెకండ్ హ్యాండ్ పేరుతో అమ్మేయడం వల్ల ఆ టాక్స్ ను ఎగ్గొట్టవచ్చు. 

ఇప్పుడు ఈడీ కార్లు అమ్మిన బషరత్ ఖాన్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆయన వద్ద ఉన్నకారు ఎట్ హోం  హాస్పిటాలిటీ  సర్వీసెస్ అనే పేరు మీద రిజిస్టర్ అయి ఉందని ఈడీ గుర్తించినట్లుగా బండి సంజయ్ చెబుతున్నారు. ఈ కంపెనీలో ఓ డైరక్టర్లు గా..  కేటీఆర్‌తోపాటు  కల్వకుంట్ల శైలిమ ఉన్నారు. కేటీఆర్  తోపాటు ఆయన  సతీమణి ఈ కంపెనీలో డైరక్టర్ గా ఉండటంతో.. ఈ లావాదేవీపైనా ఈడీ దృష్టి పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో కేటీఆర్ .. అరెస్టు చేసుకుంటే చేసుకోవచ్చని సవాల్ చేయడం ఆసక్తికరంగా మారింది.                      

Continues below advertisement