Heavy rains across Telangana: బంగాళాఖాతంలో  ఏర్పడిన అల్పపీడనం కారణంగా  తెలంగాణలో  భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.  హైదరాబాద్‌లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ  వర్షాలు పడ్డాయి. IMD ప్రకారం, ఈ అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతుంది.  హైదరాబాద్‌లో సాయంత్రం సమయంలో అల్వాల్, మల్కజిగిరి, కుతుబుల్లాపూర్, గజులరామారాం వంటి ప్రాంతాల్లో మొదలై, మిగిలిన భాగాలకు వ్యాపించే అవకాశం ఉంది. నల్గొండ, యాదాద్రి-భువనగిరి, జనగాం హన్మకొండ, ములుగు, కరీంనగర్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.  

Continues below advertisement

గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు  కురిసిన వానతో   హైదరాబాద్‌లో రోడ్లు నీటముండ్రిపోయి. రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య, దక్షిణ భాగాలు మరింత తీవ్రంగా ప్రభావితమయ్యాయి.   హైదరాబాద్‌లో హిమాయత్‌నగర్, కేపీఎచ్‌బి, మియాపూర్, లింగంపల్లి, కొండాపూర్, గాచిబౌలి, మాధాపూర్, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో 100 మి.మీ.కు పైగా వానలు పడ్డాయి.  

Continues below advertisement

  ఇండియా మెట్రాలజాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) ప్రకారం  రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  కొన్ని ప్రాంతాల్లో  115.6-204.4 మి.మీ. వరకూ వర్షం  పడే ్వకాశం ఉంది.  హైదరాబాద్‌లో శుక్రవారం  సాయంత్రం  నుంచి భారీ వానలు మొదలై, రాత్రి వరకు కొనసాగుతాయి. శని, ఆదివారం  భారీ వర్షం పడే అవకాశం ఉంది.  రాష్ట్రంలో మధ్య, తూర్పు, పశ్చిమ, దక్షిణ-తూర్పు భాగాల్లో సీరియస్ రెయిన్‌ఫాల్ అలర్ట్ జారీ చేశారు.  

  ప్రభుత్వం, GHMC అధికారులు డ్రైనేజ్ శుభ్రపరచడం, రోడ్లు క్లియర్ చేయడం మొదలుపెట్టారు. IMD, పొలీసులు ప్రజలకు "అనవసర ప్రయాణాలు మానుకోవాలి, హెల్మెట్లు ధరించాలి, ఎమర్జెన్సీ సర్వీసెస్ సిద్ధంగా ఉంచాలి" అని సూచించారు. రాష్ట్రంలో వర్షాలు అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయని అంచనా. అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణాన్ని, వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.