Doctor KTR : డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని సినీ స్టార్లు చెబుతూంటారు. ఒక్క సినీ స్టార్లే కాదు.. విద్యార్థి దశలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్‌కు.. వారి తల్లిదండ్రులకు కూడా మా బిడ్డ డాక్టర్ అయితే బాగుండు అని కోరుకుంటారు. వైద్యుడంటే ఉండే క్రేజ్ అదే మరి. దీనికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తల్లిదండ్రులు కూడా మినహాయింపేమీ కాదు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయగా వెల్లడించారు. తాను డాక్టర్ కావాలని తన తల్లి గట్టిగా ఆకాంక్షించారని కేటీఆర్ తెలిపారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో నిర్వహించిన ఉమెన్ ఇన్ మెడిసిన్ కాన్క్లేవ్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా చేసిన ప్రసంగంలోఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రతి తల్లీతండ్రీ తమ పిల్లలు వైద్యులు కావాలని కోరుకుంటారు !
ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారని.. తమ తల్లి కూడా అలానే కోరుకున్నారని చెప్పారు. గ వైద్యరంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని చెప్పారు. వైద్యవృత్తి ఎంతో ఉన్నతమైనదని.. వైద్యవృత్తిలో మహిళలు రాణించడం గొప్ప విషయమన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మహిళల పాత్ర ఎంతో కీలకమని వెల్లడించారు. భారత్లో జెండర్ ఈక్వాలిటీని పాటించే కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో మహిళ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. మహిళలు వ్యాపారంలో రాణించేలా విహబ్ ఏర్పాటు చేయడంతో పాటు తగిన ప్రోత్సాహం అందజేస్తున్నట్లు తెలిపారు.
వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనది !
వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు వైద్యులు కుటుంబ జీవితాన్ని త్యాగం చేస్తారన్నారు. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ ఉన్నా అటెండ్ అవుతారని తెలిపారు. వైద్య రంగంలో మహిళలు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. వైద్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉండాలని సీఎం కేసీఆర్ ఎప్పుడు అంటుంటారని చెప్పారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి వీ-హబ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. కరోనా సమయంలో ఏఐజీ ఆస్పత్రి మంచి సేవలు అందించిందని అభినందించారు.
సీబీఐని హైదరాబాద్‌కు ఆహ్వానించిన కవిత - ఇక " జనరల్ కన్సెంట్ రద్దు " పని చేయదా ?