KTR has shared a photo on social media with a well grown beard :  కేటీఆర్ అంటే నీట్ షేవ్‌తో కనిపించే లీడర్. కనీసం మీసాలు కూడా పెంచుకోరు. కానీ ఆయన అర్జున్ రెడ్డి సినిమాలో  హీరోలా జుట్టు గడ్డం, మీసాలు పెంచుకుంటే ఎలా ఉంుంది. ఊహించలేం కదా.. కానీ ఆయనను అలా చూడాలని ఓ అభిమానికి అనిపిచింది. వెంటనే రెడీ చేశారు.. ఏఐ టెక్నాలజీ  ద్వారా రూపొందించి కేటీఆర్ కే షేర్ చేశారు. 





   సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా తమకు ఇష్టమైన నాయకుల ఫోటోలు, వీడియోలు అభిమానులు ఎడిట్ చేస్తున్నారు.కొత్త లుక్‌లతో తమ నాయకుల ఫోటోలు ఎడిట్ చేసి జీమ్ బాడీ ఉన్నట్లుగా చేయడం, కేజీఎఫ్ హీరో లుక్ ఇవ్వడం లాంటివి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి కార్యకర్తలు తమ నాయకుడి పై అభిమానం చాటుకుంటున్నారు. అమెరికాలో ఉండే కేటీఆర్ అభిమానులు  ఆయన కోసం కొత్త లుక్ తయారు చేశారు.                           
 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘మాస్ లుక్’ గడ్డంతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోను స్వయంగా కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్‌ చేసి పంపిన నా ఫొటోను ట్వీట్‌ చేస్తున్నా.. నా జట్టు, గడ్డం నేనే ఇలా పెంచగలిగితే.. అని పేర్కొన్నారు. కేటీఆర్‌ చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లుక్ కేటీఆర్ ట్రై చేయాలని అభిమానులు కేటీఆర్‌ను కోరారు.                                                                                                                     


ఆ  ట్వీట్ కింద ఆయన కుమారుడు మరో పిక్ షేర్ చేశాడు. దానికి క్లాసిక్ అని క్యాప్షన్ పెట్టారు.