KTR fires on congress over attack on bhupal reddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి  కేటీఆర్​ కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడ్దారు. కాంగ్రెస్ పాలనలో దివ్యంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుండగులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సోషల్​ మీడియా ఎక్స్​ వేదికగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కు భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదని.. ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ఓ ప్రభుత్వ ఆఫీసులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డిని బూతులు తిడుతూ పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. 

ఉల్టా తమ నేతనే అరెస్ట్​ చేశారుదాడి చేసింది మంత్రి గూండాలు అయితే.. పోలీసులు భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఫైర్​ అయ్యారు. ప్రశ్నించిన తమ నేతను అరెస్ట్​ చేసి.. దాడి చేసిన వారిమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరని మండిపడ్డారు. తమ నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి మీద జరిగిన పాశవిక దాడిని ఖండిస్తున్నానన్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీని కోరుతున్నానని కేటీఆర్ ఎక్స్​లో పేర్కొన్నారు.

కాంగ్రెస్​కు ఆ సోయి లేదుఇదిలాఉండగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్​ మంగళవారం తలసాని శ్రీనివాసరావు ఇంట్లో సమావేశమయ్యారు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో కంచెలు వేసి కాపాడిన ప్రభుత్వ పార్కులకు కాంగ్రెస్‌ పాలనలో రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతకాదనే నిజాన్నిహైదరాబాద్‌ ప్రజలు అర్థం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ హయాంలో నిర్మించిన కట్టడాలు, నిర్మాణాల నిర్వహణ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కాపాడాలని ఈ ప్రభుత్వానికి సోయి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.