KTR Chit Chat: ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారింది… దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే  కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన చేసిన దుష్ప్రచారం తేలిపోయింది… నిన్నటి సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయన్నారు. ఈ కాంగ్రెస్ బిజెపి కలసి కాలేశ్వరం పై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

కాలేశ్వరం ప్రాజెక్టుపై నికృష్టమైన, నీచమైన రాజకీయాలు చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ కమిషన్లు బయటపడుతున్నాయని తెలిసాకే… ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు చేస్తున్నారని విమర్శించారు.   సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. జస్టిస్ ఘోష్  విచారణ పూర్తయిందన్నారు. అయితే మళ్లీ ఎందుకు పొడిగించారు? ప్రభుత్వం చెప్పాలన్నారు. కాలేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్టు సమాచారం లేదని తెలిపారు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని..  కాలేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలను కూలగొట్టి మళ్లీ టెండర్ల పిలిచి, 20 నుంచి 30% కమిషన్లు తీసుకోవాలన్నదే అసలు ఏజెండా అని కేటీఆర్ ఆరోపించారు.  

సుప్రీంకోర్టుకు కాలేశ్వరం ప్రాధాన్యత, గొప్పతనం అర్థమైంది. సెంట్రల్ వాటర్ కమిషన్‌కు అర్థమైంది, అందుకే 'ఇరిగేషన్ మార్వెల్' అన్నారన్నారు. న్యాయమూర్తులకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ అధికారంలో ఉన్న అజ్ఞాని ముఖ్యమంత్రికి అర్థమవడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి పై ముఖ్యమంత్రి చేసిన కుట్రలు విఫలమయ్యాయని.. పాలమూరు-రంగారెడ్డిని వెంటనే పూర్తిచేసి మహబూబ్‌నగర్ ప్రజలకు సాగునీరు ఇవ్వాలని మన జిల్లా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. 'పాలమూరు బిడ్డ'ను చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారని ప్రశఅనించారు.  పాలమూరులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్టే, కాళేశ్వరంపైన కూడా స్పష్టమైన తీర్పులు వస్తాయి. కాలేశ్వరం ప్రాధాన్యతను ప్రజలకు, ఈ మూర్ఖ కాంగ్రెస్ నాయకులకు అర్థమయ్యేలా చెబుతాయమన్నారు.  

580 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ముఖ్యమంత్రి అందాల పోటీలో ఉండడం కరెక్టా? అని ప్రశ్నించారు. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే, అందాల పోటీలకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ప్రమాదం జరిగితే ఒక్కసారి పోనీ రేవంత్ రెడ్డి అందాల పోటీలకు నాలుగు సార్లు పోయాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ దగ్గర ఒక రూపాయి కూడా లేదు అని చెప్పి, అందరూ దొంగలలాగా చూస్తున్నారంటూ… రెండువందల కోట్ల రూపాయలు అందాల పోటీలకు ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. 

మిస్ వరల్డ్ కాంటెస్టులకు మంత్రులంతా టూర్ గైడ్లుగా మారిపోయారు. మంత్రులు సొంగ గాడ్చుకుంటూ అందాల పోటీలో పాల్గొంటున్నారని సిపిఐ నారాయణ అన్నారు. మిస్ వరల్డ్ బ్యూటీస్… కాలేశ్వరం మీద నోటీసులు – ఇదే రేవంత్ రాజకీయమని విమర్శించారు. మిస్ వరల్డ్ బ్యూటీస్‌కి కూడా రేవంత్ రెడ్డి చూపిస్తున్నది – అంతా మా ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు మాత్రమేనన్నారు. నిజాం కట్టిన చార్మినార్ లేదా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు తప్ప, కాంగ్రెస్ పార్టీ కట్టిన ఒక్కదానినైనా రేవంత్ రెడ్డి చూపించగలడా అని ప్రశ్నించారు. కాలేశ్వరంలోని రెండు పిల్లర్లకు ఇంత రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఏం చేసిందని ప్రశ్నించారు. మూడు నెలల తర్వాత కూడా అందులో చిక్కుకున్న వారిని బయటకు తీయలేకపోయారన్నారు. కమిషన్ల కోసం ఎస్ఎల్బీసీ హడావిడిగా మొదలుపెట్టారని.. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే, మగోడు అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేవాడన్నారు. 

రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు – ఒకరోజు కాలేశ్వరాన్ని 'కూలేశ్వరం' అంటాడు. రేవంత్ రెడ్డికి భయంకరమైన మానసిక వ్యాధి ఉంది. 'మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్' అనే మానసిక రుగ్మతతో ఉన్నాడన్నారు. అందుకే ఒకే అంశంపై ఆయన రోజుకోలా మాట్లాడతారని.. మరో రోజు కాలేశ్వరంలోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తామంటారన్నారు. వాళ్ల ప్రభుత్వంలోని మంత్రులు రంగనాయక సాగర్ నుంచి నీళ్లకు జెండాలు ఊపుతారు. ఒక రోజు అప్పు లేదు అంటారు… మరొక రోజు అసెంబ్లీలో రూ. 1,70,000 కోట్ల అప్పు చేశామని అంటారు.. ఒక రోజు కాకతీయ కళాతోరణం అధికార చిహ్నంగా వద్దంటారు… మరొక రోజు పొట్టి దారులకు దాన్ని చూపిస్తారు.ఒక రోజు కేసీఆర్ ఆనవాళ్లు తొలగిస్తామని అంటారు… మరొక రోజు కేసీఆర్ కట్టిన ప్రతిదీ తిరిగి చూపిస్తారని విమర్శించారు.