KTR announced will not tolerate personal attacks : రాజకీయంగా పోరాటం చేస్తూంటే వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేసేవారిపై పోరాటం కొనసాగిస్తానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, తప్పకుండా నిజం గెలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేశానని గుర్తు చేశారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలకు అడ్డూ అదుపు ఉండడం లేదని.. ఇక నుంచి అలాంటి ఆరోపణలు చేయకుండా లక్ష్మణ రేఖ గీయాల్సి ఉందన్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని తాను వ్యక్తిగత వివాదాల కంటే ప్రజా సమస్యలకే అధిక ప్రాధాన్యం ఇస్తానని గుర్తు చేశారు. చౌకబారు విమర్శలు చేసేవారికి తాను దాఖలు చేసిన పిటిషన్ ఒక గుణపాఠం అవుతుందని..కోర్టులో నిజం గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు.
బఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు తనపై అసభ్య పోస్టులు పెట్టారని మంత్రి కొండా సరేఖ కన్నీళ్లు పెట్టుకుని ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇలా సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెట్టడంపై విచారం వ్యక్తం చేశారు. అయితే కేటీఆర్ అవన్నీ దొంగ ఏడుపులని మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు. దాంతో కొండా సురేఖ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన నాగార్జున ఫ్యామిలీని వేధించారని అన్నారు. ఈ విషయంలో నాగచైతన్య, సమంత విడాకుల ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కుటుంబాల ప్రతిష్టను దిగజార్చేవిగా ఉన్నాయని అటు నాగార్జున, ఇటు కేటీఆర్ కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి.
కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
నాగార్జున మొదటగా రూ. వంద కోట్లకు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. కుటంబసమేతంగా వాంగ్మూలం ఇచ్చారు. మరికొందరి వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉంది. కేటీఆర్ కూడా ఆ తరవాత పిటిషన్ దాఖలు చేశారు. ఆయన గత వారం స్వయంగా వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉంది.కానీ కోర్టులో వాయిదా కోరారు. ఆ రోజున మూసిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మళ్లీ బుధవారం ఆయన కోర్టుకు వెళ్లి వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తుది వరకూ పోరాడతానని ఆయన చెబుతున్నారు.