KTR alleges vote Chori Jubilee Hills:  జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ లిస్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసి ఫేక్ ఓటర్లను నమోదు చేసిందని భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KTR) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో  KTR ప్రజెంటేషన్ ఇచ్చారు.  

తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రజెంటేషన్‌లో KTR ఓటర్ లిస్టులోని అవకతవకలను పవర్‌పాయింట్ స్లైడ్‌లు, డాక్యుమెంట్లతో సహా వివరించారు. జూబ్లీహిల్స్‌లో సుమారు 20,000 డూప్లికేట్ మరియు ఫేక్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇందులో 15,000 ఓట్లు చిరునామాలు లేకుండా నమోదు అయ్యాయి. సుమారు 400 పోలింగ్ బూత్‌లలో ప్రతి బూత్‌కు 50 ఫేక్ ఓట్లు ఉన్నాయన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, లోయర్ లెవల్ అధికారులతో కలిసి ఫేక్ ఓట్లు యాడ్ చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు జూబ్లీహిల్స్‌లోకి వచ్చి, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. 

 రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో చేసిన ఓట్ చోరీ ఆరోపణలు   స్థానిక స్థాయిలో ప్రతిబింబిస్తోందని KTR వ్యాఖ్యానించారు.  ఒకే వ్యక్తికి 2-3 ఓటర్ IDలు ఉన్నాయి. పేర్లలో స్పెల్లింగ్ మార్పులతో మల్టిపుల్ ఎంట్రీలు. ఒకే ఇంటి చిరునామాపై 150-200 ఓట్లు నమోదు. ఒక చిన్న ఇంట్లో 100కి పైగా ఓట్లు  ఉన్నాయన్నారు.   12,000 అన్‌వాలిడ్ ఓట్లు డిలీట్ అయినప్పటికీ, మళ్లీ 20వేల ఓట్లు పెరిగినట్లుగా చూపిస్తున్నారని అన్ని ఓట్లు ఎక్కడ నుంచి వచ్చాయని కేటీఆర్ ప్రశ్నించారు.  KTR ఎలక్షన్ కమిషన్‌కు అప్పీల్ చేసి, పూర్తి విచారణ చేపట్టాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని, కాంప్రమైజ్డ్ ఫీల్డ్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరారు. "ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించాలి " అని డిమాండ్ చేశారు. 

అయితే ఈ ఆరోపణలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.  జూబ్లీహిల్స్‌లో కొత్త ఎన్‌రోల్‌మెంట్స్ జరగలేదు. ఆరోపించిన ఓటర్లు గత ఎలక్షన్ రోల్స్‌లోనే ఉన్నారు" అని DEA ప్రకటించింది. BRS ఆరోపణలపై పూర్తి విచారణ జరుగుతుందని, కానీ ఫేక్ ఓట్లు లేవని స్పష్టం చేసింది.