Komatireddy Meets DK Sivakumar :  తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలు, విలీనాలను పర్యవేక్షిస్తున్న  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. బెంగళూరులో జరిగిన  ఈ సమావేశంలో షర్మిల పార్టీ విలీనంతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మళ్లీ చేర్చుకునే అంశంపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది.   40నిమిషాలు జరిగిన ఈభేటీ పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి ఎల్బీ నగర్ అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేస్తే తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లుగా తెలుస్తోంది.  షర్మిల చేరికపై అధిష్టానం సుముఖంగా ఉందని డీకే శివకుమార్ కోమటిరెడ్డికి చెప్పినట్లు సమాచారం. 


షర్మిల పార్టీలో చేరికపై తెలంగాణ నేతల అభ్యంతరాలపై చర్చ                     


అయితే ఆమె తెలంగాణలో రాజకీయం చేయడంపై నేతల అభ్యంతరాలపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ అభ్యంతరాలపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు  కోసం డీకే శివకుమార్ కు హైకమాండ్ బాధ్యతలు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులను చక్కదిద్ది చేరికలను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.  దీంట్లో భాగంగానే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెంగళూరు వెళ్లిన డీకే శివకుమార్‌ను కలిసి రాష్ట్రంలోని పరిణామాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి ఇటీవల ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో సమమావేశమై పలు అంశాలు చర్చించిన విషయం తెలిసిందే. 


ప్రియాంక సూచనల మేరకు  డీకే శివకుమార్ ను కలిసిన కోమటిరెడ్డి                                  


ప్రియాంకా గాంధీ ఇచ్చిన సూచనల మేరకే వెంకట్ రెడ్డి డీకే శివకుమారర్‌తో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో గొడవలేమీ లేవని కలిసి పని చేస్తన్నమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.  కర్ణాటకలో ఘన విజయం జోష్ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నిండుగా కనిపిస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం అనే ధీమాతో ఇటు టీ కాంగ్ నేతలు అటు అధిష్టానం కూడా ధీమాతో ఉంది. దీంతో నేతలంతా కలిసి పనిచేస్తున్నారు. గతంతో విమర్శలు చేసుకున్నవారు కూడా కలిసి మెలిసి పనిచేస్తున్నారు. తెలంగాణలో గెలుపు కోసం చేయాల్సిందంతా చేస్తున్నారు. 


తెలంగాణ కాంగ్రెస్ పై డీకే శివకుమార్ ప్రత్యేక శ్రద్ధ                                        


షర్మిలపైనా  కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అభిమానం చూపిస్తారు. అందుకే షర్మిల విషయం కూడా డీకే శివకుమార్ తో మాట్లాడినట్లుగా చెబుతున్నారు.  మరో వైపు బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ అనుమానిస్తోంది. అనూహ్యంగా కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలవడం.. విపక్షాల భేటీకి వ్యతిరేకంగా కామెంట్లు చేయడంతో బీఆర్ఎస్.. బీజేపీకి దగ్గరవుతోందన్న అభిప్రాయం రాజకీయవర్గాలకు కలుగుతోంది. 





Join Us on Telegram: https://t.me/abpdesamofficial