Kishan Reddy : బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్రవిమర్శలుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండేది ఇంకా ఆరు నెలలేనన్నారు. అధికారంలో ఎవరున్నా అభివృద్ధిని ఆపొద్దని సూచించారు. ఏప్రిల్ 8న సికాంద్రాబాద్ లో మోడీ సభతో పెను మార్పులుంటాయన్నారు కిషన్ రెడ్డి. ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. రూ.1400 కోట్లతో జరిగిన డబ్లింగ్ పనులను మోడీ ప్రారంభిస్తారని చెప్పారు.
రూ.7764 కోట్లతో చేపట్టే నూతన జాతీయ రహాదారులకు ప్రధాని భూమి పూజ చేస్తారని తెలిపారు. ఏప్రిల్ 8న రూ.1366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ నూతన భవనానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ట్రిపుల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. అనేక అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.ఏప్రిల్ 8న ప్రారంభించనున్న రెండో వందేభారత్ ట్రైన్ వల్ల హైదరాబాద్ టూ తిరుపతి ప్రయాణం మరింత ఈజీ కానుందన్నారు. వందేభారత్ ట్రైన్ వల్ల తిరుపతికి వెళ్లేవారు త్వరగా వెళతారని చెప్పారు.ఏప్రిల్ 8 సికాంద్రాబాద్ లో మోడీ సభతో పెను మార్పులుంటాయన్నారు కిషన్ రెడ్డి.
ఎంఎంటీఎస్ ఫేజ్ 2పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఎంఎంటీఎస్ ఫేజ్2 పై నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నా స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి కట్టుబడి లేకపోడం వల్లే ఎంఎంటీఎస్ ఆలస్యం జరిగిందన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్2 జేఐ కోసం 13 ట్రైన్ లు ప్రారంభిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ డిమాండ్‌కు స్పందించి.. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందానికి కట్టుబడి లేదని.. ఎంఎంటీఎస్ నిర్మాణానికి సంబంధించి సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. రోజులు గడుస్తుండటంతో ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందని.. చివరికి దీనిపై తానే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు.
పార్టీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ విధంగా కట్టబోతున్నారో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. విమానాశ్రయం స్థాయిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నామన్నారు.